దేశవ్యాప్తంగా ప్రతి నెల సిలిండర్లపై ఆయిల్ కంపెనీలు రేట్లను తగ్గించడమో , పెంచడమో చేస్తున్న విషయం తెలిసిందే..
ఇందులో భాగంగా తాజాగా వాణిజ్య సిలిండర్ ధర లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
ప్రస్తుతం ఎంత తగ్గించారు ఎంత రేటు ఉందంటే
తాజా నిర్ణయంతో వాణిజ్య సిలిండర్ అనగా 19 కేజీల కమర్షియల్ ఎల్పిజి పై 91.50 రూపాయలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న వాణిజ్య సిలిండర్ పై కొంత భారం తగ్గిస్తూ 2,233 రూపాయలకు చేరనుంది.
గృహ సిలిండర్లపై ఏమైనా మార్పు ఉందా
మరోవైపు 14.2 కేజీలు ఉన్నటువంటి గృహ సిలిండర్ లపై ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న 1155 రూపాయలను యధాతధంగా కొనసాగిస్తున్నారు.
వరుసగా సిలిండర్ ధరలు పెంచడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. ఎప్పుడో ఒకసారి తగ్గించినట్లు తగ్గించి వరుస నెలల్లో వీటిని పెంచుతూ వస్తున్నారు. గత నెలలోనే వాణిజ్య సిలిండర్ పై ₹350 రూపాయలను, గృహాలలో వాడే 14.2 కేజీల సిలిండర్ పై 50 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సిలిండర్లు పొందినటువంటి వారికి కొంత ఊరట ఇస్తూ 200 రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది చదవండి: ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు 200 రూపాయల సబ్సిడీ
Leave a Reply