తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట ప్రజలకు వరాలజల్లును కురిపించారు. సూర్యాపేట ప్రజలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ తెలిపారు.
సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి ఎంతగానో వేచి చూస్తున్నటువంటి ప్రజానీకానికి శుభవార్త అందించారు. అతి త్వరలో పెన్షన్ పెంపు పై ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ను అధికారంలోకి రాగానే ఇస్తామని పేర్కొన్న విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం జరిగే విషయాలనే ప్రకటిస్తుందని త్వరలోనే ఆసరా పెన్షన్ పెంపు పై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు.
CM KCR announces to hike pension amount shortly
ఇటీవల దివ్యాంగులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి 4016 రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వృద్ధులు మరియు ఇతర సామాజిక పెన్షన్ పొందే వారికి కూడా పెన్షన్ పెంపు ఉంటుంది. అయితే ఎంత మేర పెంచుతారు అనే దాని పైన త్వరలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సీఎం తెలిపారు.
ఇక సూర్యాపేట పర్యటనలో ఉన్నటువంటి సీఎం సూర్యాపేట జిల్లా ప్రజలకు వరాలు కురిపించారు.
సూర్యాపేటలోని ప్రతి గ్రామపంచాయతీ 10 లక్షల రూపాయలు, సూర్యాపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు 25 కోట్లు సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 25 కోట్లతో సూర్యాపేటలో కళాభవన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక సూర్యాపేటలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేటలో యువకుల కోసం స్పోర్ట్స్ స్టేడియం కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. సూర్యాపేటలో సమీకృత కలెక్టర్ భవనం, వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మెడ్కాలేజ్ ను ఆధునిక హంగులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
Also Read
Leave a Reply