తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
ఇకపై ఒకటి నుంచి 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించనుంది.
ముఖ్యమంత్రి అల్పాహార పథకం – CM breakfast scheme కి శ్రీకారం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల బృందం తమిళనాడు రాష్ట్రంలో అందిస్తున్నటువంటి అల్పాహార పథకాన్ని అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్రంలో సందర్శించడం జరిగింది.
అక్కడ ఇప్పటికే అమలవుతున్నటువంటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ చేసినటువంటి అధికారులు వివరాలను ముఖ్యమంత్రి అందచేసారు. అయితే ఈ పథకం తమిళనాడులో కేవలం ఒకటి నుంచి 5వ తరగతి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే వర్తిస్తునట్లుగా గుర్తించడం జరిగింది.
అయితే మరింత మందికి ఈ పథకాన్ని చెరువ చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించి ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పై అదనంగా నాలుగు వందల కోట్ల రూపాయల భారం పడనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది.
దసరా నుంచి పిల్లలకు అల్పాహారం, ఎం పెడతారంటే
ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని దసరా నుంచి ప్రారంభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ పథకంలో భాగంగా పిల్లలకు ఈ ప్రస్తుత అందిస్తున్నటువంటి రాగిజావ మరియు మధ్యాహ్న భోజనం పథకం మధ్యలో ఈ బ్రేక్ఫాస్ట్ ను అందించరనున్నారు.
అల్పాహార పథకం మెను ఇదే..
ఈ పథకం ద్వారా పిల్లలకు రవ్వ ఉప్మా, కేసరి, కిచిడి, పొంగల్ ను అల్పాహారం కింద వడ్డించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తుంది.
మరికొన్ని ఐటమ్స్ ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఉన్నటువంటి రాగి జావా మరియు కోడిగుడ్ల పంపిణీ యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
Leave a Reply