Clustering Of GSWS Secretariats: Rationalisation Of GSWS Employees లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని రెండు విభాగాలుగా విభజించనున్నారు. మొదటి విభాగంలో Multipurpose GSWS employess గా , రెండో విభాగంలో Technical GSWS Employees గా సచివాలయం ఉద్యోగులు విభజన కానున్నారు . సచివాలయాలు కూడా 3 క్యాటగిరీలుగా మారనునున్నాయి . ఉద్యోగుల విభజనకు ముందు Clustering Of GSWS Secretariats అనేది ప్రభుత్వం చేపట్టనుంది. ప్రతి గ్రామాన్ని వాలంటీర్ల క్లస్టర్ గా ఎలా అప్పట్లో విభజన చేసారో అదేవిధంగా మండల / మున్సిపాలిటీ స్థాయిలో పక్కపక్క ఉన్న సచివాలయాలను క్లస్టర్ల వారీగా MPDO / MC వారు కలపనున్నారు. ఆ తర్వాత ఉద్యోగులను కేటాయింపు అనేది జరుగుతుంది . ఈ ప్రక్రియ ద్వారా సచివాలయాలు తగ్గవు, అలా అని పెరగవు , అదే విధంగా స్థానం కూడా మారదు . కేవలం టెక్నికల్ ఉద్యోగుల కోసం మాత్రమే Clustering Of GSWS Secretariats పనిని ప్రభుత్వం ప్రారంభించింది .
Multipurpose GSWS employess
గ్రామ సచివాలయాల్లో…
- పంచాయతీ కార్యదర్శి Gr I – V
- డిజిటల్ అసిస్టెంట్
- వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్
- గ్రామ మహిళా కార్యదర్శి [ మహిళా పోలీస్ ]
వార్డు సచివాలయాల్లో…
- వార్డ్ అడ్మిన్ సెక్రటరీ
- వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
- వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ
- వార్డ్ మహిళా పోలీస్

Technical GSWS Employees
గ్రామ సచివాలయాల్లో…
- గ్రామ రెవెన్యూ అధికారి
- ANM
- సర్వే అసిస్టెంట్
- ఇంజనీరింగ్ అసిస్టెంట్
- అగ్రికల్చర్ / ఆర్టికల్చర్ / సెరికల్చర్ అసిస్టెంట్
- వెటర్నరీ / ఫిషరీస్
- ఎనర్జీ అసిస్టెంట్
వార్డు సచివాలయాల్లో…
- వార్డ్ రెవెన్యూ సెక్రెటరీ
- వార్డ్ హెల్త్ సెక్రటరీ
- వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ
- వార్డ్ అమ్యూనిటీస్ సెక్రెటరీ
- వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ
- వార్డ్ ఎనర్జీ అసిస్టెంట్

Categories Of GSWS Secretariats
- కేటగిరి A అంటే 2500 కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి సచివాలయాల
- కేటగిరి B సచివాలయాలు అంటే 2051 నుండి 3500 జనాభా వరకు ఉన్నటువంటి సచివాలయాలు
- కేటగిరి C సచివాలయాలు అంటే 3501 నుండి దానికన్నా ఎక్కువ జనాభా కలిగిన గ్రామ వార్డు సచివాలయాలు
Clustering Of GSWS Secretariats Guidlines
- ప్రస్తుతం ఒక సచివాలయ పరిధిలో ఒక టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు . భవిష్యత్తులో రెండు సచివాలయాలను ఒక క్లస్టర్ గా చేస్తూ ఆ క్లస్టర్ కు టెక్నికల్ విభాగంలో ఉన్న ఒక సచివాలయ ఉద్యోగుని ను జోడించడం జరుగుతుంది. వారు ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న రెండు సచివాలయాలకు సేవలు అందిస్తారు.
- జనాభా ఆధారంగా ఈ Clustering Of Secretariats ఉండదు కేవలం ప్రక్క ప్రక్కన ఉంటే సరిపోతుంది . 5 వేల జనాభా కలిగిన ఒక సచివాలయం పక్కనే ఇంకొక 5 వేల జనాభా కలిగిన సచివాలయం ఉన్నట్లయితే ఆ రెండు పక్క పక్కన ఉన్నట్లయితే వాటిని ఒక క్లస్టర్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది అప్పుడు ఆ క్లస్టర్ పరిధిలో మొత్తం జనాభా 10 వేలు అవుతుంది .
- జనాభా ఆధారంగా సచివాలయాలను 3 క్యాటగిరీలుగా విభజిస్తున్న విషయం తెలిసిందే అది కేవలం ఎవరైతే మల్టీపర్పస్ ఉద్యోగులు ఉంటారు వారిని ఉద్దేశించి మాత్రమే. అంత జనాభా కు ఎంత మంది మల్టీపర్పస్ స్టాప్ అందుబాటులో ఉండాలి అని ఉద్దేశించి సచివాలయాలను మూడు క్యాటగిరీలుగా విభజన చేయడం జరుగుతుంది .
- ఒక మండల లేదా మున్సిపాలిటీ పరిధిలో సచివాలయ సంఖ్య సరి సంఖ్య [ 10,12,14,16 etc… ] అయితే ప్రతి క్లస్టర్కు 2 సచివాలయాలు వస్తాయి. అదే సచివాలయాల సంఖ్య బేసి సంఖ్య అయితే [ 11,13,15,17,19etc… ] అప్పుడు ఒక క్లస్టర్లో మాత్రమే 1లేదా 3 సచివాలయాలను గ్రూప్ చేస్తూ క్లస్టర్ను ఏర్పాటు చేస్తూ మిగిలిన క్లస్టర్లలో రెండు సచివాలయాల చొప్పున క్లస్టర్ చేయాల్సి ఉంటుంది .
- మండలము లేదా మున్సిపాలిటీలో బేసి సంఖ్య సచివాలయాలు ఉన్నప్పుడు ఒకటికి మించి ఎక్కువ క్లస్టర్లలో ఒకటికి మించి ఎక్కువ క్లస్టర్లలో మూడు లేదా ఒకటి సచివాలయాలు ఉండడానికి లేదు.
- గ్రామాల నుండి వార్డుకు షిఫ్ట్ అయినవి మరియు కోర్టు కేసులు ఉన్న సచివాలయాలను జిల్లా కోఆర్డినేటర్ వారి ద్వారా రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది.
- Clustering Of Secretariat కు సచివాలయ పరిధిలో ఉన్న క్లస్టర్ లకు ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం సచివాల పరిధిలో ఉన్న క్లస్టర్లు పెంచడానికి లేదా తగ్గించడానికి లేదా జనాభాపరంగా సర్దుబాటు చేయడానికి ఈ ఆప్షన్ ద్వారా అవకాశం ఉండదు .
- ఈ ప్రక్రియ ద్వారా సచివాలయాలు తగ్గవు, అలా అని పెరగవు , అదే విధంగా స్థానం కూడా మారదు
Leave a Reply