మండల లేదా మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో సచివాలయాన్ని క్లస్టర్ మ్యాపింగ్ చేసే సమయంలో కొందరికి సందేహాలు తలెత్తుతున్నాయి దానిపై సూచనలు
క్లస్టర్ మ్యాపింగ్ ప్రధాన ఉద్దేశం భౌగోళికంగా పక్కపక్కన ఉన్న రెండు సచివాలయాలని ఒక క్లస్టర్ గా చేయడం తద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఆ క్లస్టర్ లో ఉన్న రెండు సచివాలయాలకు తమ సర్వీసులను అందించాల్సి ఉంటుంది,
దీనికి పాపులేషన్ తో సంబంధం లేదు పక్కపక్కనే క్యాటగిరి సి సచివాలయాలు ఉన్నా కూడా వాటిని ఒక క్లస్టర్ గా మ్యాప్ చేయాల్సి ఉంది
మండల హెడ్ క్వార్టర్ పంచాయతీ లేదా ఇతర పెద్ద పంచాయతీలు ఉన్నప్పుడు ఆ రెండు సచివాలయాలను ఒక క్లస్టర్ గా మ్యాప్ చేయొచ్చు,
రెండు కంటే ఎక్కువ సచివాలయాలు ఉంటే
మూడు సచివాలయాలు ఉంటే మూడింటిని ఒకే క్లస్టర్ గా చేయవచ్చు
నాలుగు లేదా ఐదు సచివాలయాలు ఉంటే వాటిని రెండు క్లస్టర్లుగా విభజించవచ్చు
ఏదైనా మండలంలో క్లస్టర్లన్నీ విభజించిన తర్వాత జనాభా పరంగా ఒక పెద్ద సచివాలయం ఉంటే గనక దానిని సెపరేట్గా ఒక క్లస్టర్ గా ఉంచవచ్చు
ఒక మండలం లేదా మున్సిపాలిటీలో ఒక క్లస్టర్ లో మాత్రమే మూడు సచివాలయాలను మ్యాప్ చేసే అవకాశం ఉంది
మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు లేదా మున్సిపల్ కమిషనర్లు క్లస్టర్ మ్యాపింగ్ వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేయాలని తెలియజేయడమైనది.
ఈ క్లస్టర్ మ్యాపింగ్ ని ప్రజా ప్రతినిధుల దృష్టిలో పెట్టే సమయంలో క్లస్టర్ మ్యాపింగ్ లో జియోగ్రాఫికల్ గా దగ్గరగా ఉన్న సచివాలయాలను మ్యాప్ చేయడం వల్ల సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్లు సులువుగా సర్వీసులు అందించగలరని తెలియజేసి ఒప్పించి వేగం ఈ ప్రకటనను పూర్తి చేస్తారని ఆశించడమైనది.
Leave a Reply