Citizen Outreach Survey May Guidelines

Citizen Outreach Survey May Guidelines

Below are the detailed guidelines for citizen and beneficiary outreach survey for the month of May 2022

మే నెల కు సంబంధించి 27,28 తేదీలలో ఔట్రీచ్ ప్రోగ్రాం ఉంటుంది.

Focused Points & Survey Details

  • 1. NPCI Mapping
  • 2. Survey on Volunteer Visit
  • 3. Survey on Scheme Related information
  • 4. ROFR Patta Distribution
  • 5. Survey on Long Pending Grievances Portal & Bi-Annual Sanctions
  • 6. Caste Data Updation [ only for few beneficiaries ]
  • 7. Phone Number Update of every person in HH
  • 8. Relationship Mapping with HH Head
  • 9. Education Data
  • 10. Occupation data

I. SURVEY ON VOLUNTEER VISIT

వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా అనే దానిపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలి.

Q) మీ వాలంటీర్ ఎన్ని రోజులకు ఒకసారి మీ ఇంటిని సందర్శిస్తున్నారు ?
Options: రాలేదు , నెలకు ఒకసారి , నెల పైబడి


II. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వే మే 2022 :
ప్రశ్న : Q) ఆధార్‌ నంబర్ ని బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయాలని మీకు తెలుసా?
Ans: a.తెలుసు b.తెలియదు


Important Points about Aadhar & NPCI Mapping:

ఇక నుంచి సంక్షేమ పథకాల మొత్తమును ఎటువంటి అకౌంట్ నంబర్లు తీసుకోకుండా/నమోదు చేయకుండానే, లబ్దిదారుల ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లలో (Through NPCI) జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
1. ఆధార్ ఆధారిత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌లు అనేది బ్యాంక్ వివరాలను తీసుకోకుండా నేరుగా లబ్ధిదారుల యాక్టివ్ ఖాతాకు నగదు పథక ప్రయోజనాలను బదిలీ చేసే విధానం.
2. ఆధార్ ఆధారిత DBT కోసం, లబ్ధిదారులు తమ ఆధార్ సీడెడ్ యాక్టివ్ బ్యాంక్ ఖాతాను NPCIతో మ్యాప్ చేయాలి.
3. ప్రతి ఆధార్ సంఖ్య యొక్క ప్రస్తుత స్థితి. “యాక్టివ్”, “ఇనాక్టివ్” & “మ్యాప్ చేయబడలేదు”గా చూపిస్తుంది.
CASE-1:-యాక్టివ్ స్టేటస్ అంటే, ఆధార్ NPCI తో మ్యాప్ చేయబడింది మరియు డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలకు అర్హమైనది.
CASE-2 :-ఇది “ఇన్‌యాక్టివ్ ఆధార్ ఎర్రర్” అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి?
Q: ఇన్‌యాక్టివ్ ఆధార్ కార్డ్ కారణాలు ఏమిటి?
a. బాల్ ఆధార్ తప్పనిసరిగా 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. లేకుంటే, అది స్వయంచాలకంగా నిష్క్రియం అవుతుంది.
b. గుర్తింపు రుజువుగా 5-10 సంవత్సరాలు ఆధార్ కార్డును ఉపయోగించకపోతే.
Q: ఇనాక్టివ్ ఆధార్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
జ: eKYC ఆధార్ కార్డ్ స్థితిని అప్‌డేట్ చేయడం ద్వారా ఇన్‌యాక్టివ్ నుండి యాక్టివ్ గా మారుతుంది.
CASE-3 :- Q. “నాట్ మ్యాప్ చేయబడిన ఆధార్” లోపం అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి? “నాట్ మ్యాప్ చేయని ఆధార్ కార్డ్”కి కారణం ఏమిటి?
A: NPCIతో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్‌లో సమ్మతి ఫారమ్ ఇవ్వబడలేదు.
Q: బ్యాంక్‌తో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడం ఎలా?
A: NPCIతో ఆధార్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్ వద్ద సమ్మతి పత్రాన్ని సమర్పించడం.

10-13 సంవత్సరాల వారికి పేరెంట్స్ తో జాయింట్ అకౌంట్ తెరవచ్చు
14 కంటే పైన వయసు వారికి ‘open account’ ఓపెన్ చేయవచ్చు

III. Survey on Scheme Related information – పథకాల తాలూకు వివరాలు

Q) జూన్ నెలలో అమలు కాబడె పథకాలకు సంబంధించి కింది విదంగా అవహగానా కల్పించారా?

Ans: అవును / కాదు

జూన్ నెలలో అమలు కానున్న పథకాలు

జగనన్న విద్యా కానుక ᶜˡⁱᶜᵏ ʰᵉʳᵉ

ఉచిత పంటల బీమా పథకంᶜˡⁱᶜᵏ ʰᵉʳᵉ

అమ్మ ఒడిᶜˡⁱᶜᵏ ʰᵉʳᵉ


సిటిజన్ ఔట్రీచ్ సర్వే లో సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు ఈ పథకాల గురించి ప్రజలకు వివరించాలి.

Note: జూన్ నెలలో జగనన్న అమ్మ ఒడి పథకం తాలూకు నగదు పథకం యొక్క విద్యార్థుల తల్లి లేదా గార్డియన్ కు జమ చేయడం జరుగుతుంది ఈ పథకం కు సంబంధించి అర్హత కలిగి దాఖలు చేసి ఉంటే దగ్గర్లో సచివాలయంలో మంజూరు వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ ని వారి యొక్క నెంబర్ తో లింక్ అయిందో లేదో ఒకసారి చూసుకొని కానీ ఎడల తక్షణమే చేసుకొనవలెను.

IV: ROFR/DKT Patta

ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి ROFR పట్టాలు / DKT పట్టాల వివరాల నమోదు :

4.మీకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వచ్చే ROFR/DKT పట్టాల పంపిణీ పథకం గురించి తెలుసా అనే ప్రశ్నలో తెలుసు/తెలియదు ఆప్షన్స్ కలవు. తెలుసు అయితే తెలుసు అని , తెలియదు అయితే తెలియదు అని ఆప్షన్ క్లిక్ చేయండి.

Ans: a.తెలుసు b.తెలియదు

 4.1 ROFR Beneficiary status లో అవును కాదు ఆప్షన్స్ అవును అయితే అవును కాదు అయితే కాదు అని ఆప్షన్ క్లిక్ చేయండి.’

Ans: అవును / కాదు

4.2 Physical copy status లో అవును/కాదు ఆప్షన్స్ కాల్ అవును అయితే అవును కాదు అయితే కాదు అని ఆప్షన్ క్లిక్ చేయండి

Ans: అవును / కాదు

V. Long Pending Greivances/Bi-annual Sanction
5.1 ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు పరిష్కరింపబడని సమస్యల అర్జీలను స్వీకరించడానికి GSWS లో ఒక లాంగ్ పెండింగ్ గ్రీవెన్స్ పోర్టల్ DA/WEDPS లాగిన్ లో ఇవ్వబడింది అని మీకు అవగాహన ఉందా?
Ans.అవును/కాదు

అన్ని అర్హతలు ఉండి ఏదైనా కారణం చేత ఏదైనా ప్రభుత్వ పథకం మంజూరు కాని యెడల మీరు మీ సంబంధించిన సచివాలయంలో DA/WEDPS దగ్గర దరఖాస్తు చేసుకోగలరు.

5.2 ఏదైనా కారణం చేత దరఖాస్తు తిరస్కరణకు గురై గ్రీవెన్స్ ద్వారా తిరిగి అర్హత సాధించి మరియు జనవరి తర్వాత అమలు చేసిన పథకాలకు సంబంధించి 30 రోజులకే స్పీడు దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన కొత్త దరఖాస్తుదారులకు జూన్ విడత Bi-Annual Sanction ద్వారా ఆ పథకం యొక్క నగదు జమ అవుతుందని మీకు అవగాహన ఉందా?

Ans. అవును/కాదు

తరువాత లబ్ధిదారుల ఫోటో ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత
ROFR Beneficiary status మరియు Physical status లో 4 వ పాయింట్ లో చెప్పిన విధంగా స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి.

VI.Caste Data Updation [ only for few beneficiaries ]

Note: క్యాస్ట్ అప్డేట్ అనేది కొంతమందికి మాత్రమే చూపిస్తుంది

ఫోకస్ పాయింట్స్ లో ఉన్న అన్ని వివరాలు యాప్ లో నమోదు చేసాక  submit and proceed బటన్ పైన క్లిక్ చేయాలి

అప్పుడు అప్లికేషన్లో Data submitted successfully అని వస్తుంది

ఆ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుంది అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ household కి సంబంధించిన డేటా చూపిస్తుంది.

అందులో PENDING button పైన క్లిక్ చేయండి

ఆ తర్వాత కింది వివరాలు నమోదు చేయండి.

10. మీ మొబైల్ నెంబర్ ను నమోదు చేయండి

___[ఇక్కడ HH లో ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయండి]

11. మీ మొబైల్ స్మార్ట్ ఫోన్
అవును/కాదు

12. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా

అవును/కాదు

12.1 పై ప్రశ్నకు అవును సమాధానం అయితే ఏదొక ఆప్షన్ ఎంచుకోవాలి 

ఈ వివరాలు తీసుకున్న తర్వాత proceed button పైన క్లిక్ చేయండి

ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లు కూడా చూపిస్తుంది ఈ పై విధంగా అందరి కుటుంబ సభ్యులకు వివరాలు సేకరించాలి

అంతా పూర్తయిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు Data successfully submitted అని వస్తుంది

Search by aadhar option ద్వారా కూడా పై సర్వే ను చేయవచ్చు

గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు

1. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ! వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
2. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
3. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
4. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.
5. ప్రభుత్వ సంక్షేమ పధకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన కరపత్రాన్ని ప్రజలందరికీ అందజేయవలెను.
6. గ్రామ/వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
7. యాప్ లోని ప్రశ్నావళిని గ్రామ! వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
8. ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
9. ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి .
10. పౌరుల ఫోటోని క్యాప్చర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి ‘ఔట్ రీచ్ కాంపెయిన్’ లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page