ఏప్రిల్ నెలకి గాను సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం (COP) 28 మరియు 29 తేదీలలో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం – గమనిక
- eKYC పూర్తి అయినా కూడా Partially Completed అని వస్తున్న వాటిని వదిలిపెట్టి మిగతావి పూర్తి చెయ్యాలి. మిగిలినవి తరువాత అప్డేట్ అవుతాయి.
- ఒక సారి ఒక మొబైల్ లొ మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
- ఈ సారి eKYC పెండింగ్ ఉన్న వారికి బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP ఆధారంగా eKYC చేయాలి. eKYC చెయ్యకపోతే PARTIALLY COMPLETED అని స్టేటస్ చూపిస్తుంది. సర్వే సమయంలో అందుబాటులో ఉన్న వారికి తప్పనిసరిగా eKYC చేయాలి. అందుబాటులో లేరు / వలసలో ఉన్నారు / మరణించారు అని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చెయ్యరాదు.
- మొదటి రోజు 50%, మరుసటి 50% సర్వే పూర్తి అయ్యేలా చూడాలి.ఒకే రోజు 100% అయిన పర్వాలేదు కానీ 50% కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి
Citizen Outreach Program April – 2023 Month Focus points:
- సచివాలయాల్లో అందించే ఆధార్ సేవలు – Awareness on Aadhaar services and availability of Aadhaar services in Secretariats
- మునిసిపాలిటీ లో ఉండే ప్రాపర్టీ సీడింగ్ – Awareness on MAUD property Seeding Status
- కరెంటు మీటర్ సీడింగ్ – Awareness on Electricity meter Seeding Status
- సిటిజెన్ eKYC – Updation of eKYC for 2.34 Cr Citizens
సర్వే చేయు విధానం :
- సిటిజన్ ఔట్రీస్ ప్రోగ్రాం ను Citizen Outreach App మొబైల్ అప్లికేషన్ లో చెయ్యాలి. ప్రతి ఉద్యోగి పాత GSWS యూసర్ నేమ్ తో లాగిన్ అయ్యి, User ID వద్ద సచివాలయం కోడ్ – హోదా ను ఎంటర్ చేయాలి. ఉదా. సచివాలయం కోడ్ 10180302, ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి అయితే వారు 10180302-PS అని ఎంటర్ చేయాలి.
- లాగిన్ లో Biometric / Irish / Face అనే మూడు ఆప్షన్ లో ఎదో ఒక ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. Face ద్వారా లాగిన్ అవ్వాలి అంటే Aadhar Face RD అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలెను.
- Home Page లొ Survey By Cluster మరియు Survey By Aadhar అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. క్లస్టర్ వారీగా చేయాలి అనుకుంటే Survey By Cluster సెలెక్ట్ చేసుకొని చేయాలి. సిటిజెన్ ఆధార్ ద్వారా చెయ్యాలి అనుకుంటే Survey By Aadhar అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- Survey By Cluster ఎంచుకుంటే క్లస్టర్ ఎంచుకొని అందులో Search ఆప్షన్ ద్వారా లబ్ధిదారుని ఎంచుకోవాలి.
- పేరు పై క్లిక్ చేసాక House Hold మాపింగ్ ప్రకారం ఆ కుటుంబం లో అందరి పేర్లు సంవత్సరాల వారీగా మరియు వారికి వివిధ పథకాల ద్వారా అందిన లబ్ధి వివరాలు చూపిస్తాయి. ఆ వివరాలను లబ్దిదారులకు వివరించాలి.
April Month Citizen Outreach Survey Process on Focus Points
1. Aadhaar Service
ప్రశ్న : గ్రామ/ వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల గురించి మీకు తెలుసా??
సమాధానం : తెలుసు / తెలియదు
ప్రశ్న : ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఆధార్ కార్డు లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలని మీకు తెలుసా?
సమాధానం : తెలుసు / తెలియదు
ప్రశ్న : పిల్లలు 5 Yrs నిండిన తరవాత మరియు 15 yrs నిండిన తరువాత ఆధార్ కేంద్రం లో బయోమెట్రిక్స్/వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలని మీకు తెలుసా?
సమాధానం : తెలుసు / తెలియదు
Note : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం 2300 గ్రామ/ వార్డు సచివాలయాలలో ఆధార్ కేంద్రాలు నెలకొల్పడం జరిగినది. వెంటనే మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రం ఉన్న సచివాలయానికి వెళ్లి పై తెలిపిన సేవలను ఉపయోగించుకొనవలెను. ప్రభుత్వ పథకాలు సకాలం లో మీకు అందాలన్నా మరియు మీ బ్యాంకు లావాదేవీలు సక్రమంగా జరగాలన్నా ఆధార్ డాకుమెంట్స్ ని తప్పని సరిగా అప్డేట్ చేసుకొనవలెను
2. MAUD Property Seeding
MAUD Property Seeding కు సంబందించి సిటిజెన్ కు మునిసిపాలిటీలో ఎటువంటి భూమి ఉన్నట్లయితే ఆ వివరాలు చూపిస్తాయి, అది ఆ వ్యక్తికి సంబందించినదా కాదా అని వివరాలను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
3. Electricity Meter Seeding
ప్రతి కుటుంబంలో వారి పేరుపై ఏ ఏ మీటర్లు లింక్ అయి ఉన్నాయి అనే వివరాలు చూపిస్తాయి. అవి వారిపై లింక్ అయినవా కావా అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
4. Update of eKYC of 2.34 Cr Citizens
కుటుంబంలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సారి e-KYC చేయవలసి ఉంటుంది. e-KYC కు సిటిజన్ అందుబాటులో లేకపోతే కారణం కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ కేవైసీ కు ఇంకా పెండింగ్ ఉన్న వారి వివరాలను సర్వే చేయి సమయంలో చూపించడం జరుగును. సర్వే పెండింగ్ ఉన్న వారి పేరు సెలెక్ట్ చేసి ఈ కేవైసీ తీసుకోవలసి ఉంటుంది. అప్పటికి అందుబాటులో లేకపోతే ఎందుకు అందుబాటులో లేరు అనే విషయాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సిటిజెన్ eKYC కొరకు Biometric / Irish / Face / OTP ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది.
Capture వద్ద లబ్ధిదారుని ఫోటో తీసి , Location ON చేసి Lat, Long వివరాలు కాప్చర్ చేసి Submit చేస్తే Data Saved Successfully అని వస్తే ఆ కుటుంబానికి సర్వే పూర్తి అయినట్టు.
Note :
- మొబైల్ అప్లికేషన్ లో ఒక్కసారి ఒక్కరు మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది.రెండో మొబైల్ లో లాగిన్ అవ్వటానికి ప్రయత్నిస్తే “Please relogin as user logged off or logged in from another device” అని వస్తుంది.
- లాగిన్ అయ్యే సమయం ఎవరికి అయినా “Application will not work on this device as USB Debugging is enabled. 892” అని వస్తే వారు మొబైల్ లొ Developer Mode Settings లొ Usb Debugging ఆప్షన్ ను Disable చెయ్యండి.
- సర్వే చేయు సమయం లొ “Please try again…Attempt to invoke virtual method ‘boolean java.io.File.exists()’ on a null object reference” లేదా “Auth XSD Validation Failed.” లేదా “No Data Available” అని వస్తే అప్పడూ log Out చేసి మరలా లాగిన్ అవ్వాలి.
- పంచాయతీ కార్యదర్శులకు (Gr I to V) ఈ మధ్యకాలంలో క్రియేట్ చేసిన గ్రామ వార్డు సచివాలయ యూసర్ నేమ్ తో లాగిన్ అయితే వారికి సర్వే ఓపెన్ అవుతుంది. అవి ఓపెన్ అవ్వక పోతే Sachivalayam Code – PS తో ట్రై చెయ్యండి.
- ప్రభుత్వ స్కానర్లకు సంబంధించిన “ERROR:-WARRANTY/ SUBSCRIPTION/SUPPORT VALIDITY IS OVER. PL RENEW.” సమస్య క్లియర్ అవటం జరిగినది.
Leave a Reply