Children without Aadhaar verification By GSWS Employees; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన 0 -6 సంవత్సరాలు వయసు కలిగిన ప్రతి బిడ్డకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన పిల్లలు ఆధార్ కార్డు మరియు బర్త్ సర్టిఫికెట్ పో పొందారా లేదా వంటి వివరాలను సేకరించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వే చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉపయోగించే మొబైల్ యాప్ GSWS Employees Mobile App లో వెరిఫికేషన్ కోసం కొత్తగా Children without Aadaar ఆప్షన్ ఇవ్వడం జరిగింది . గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ మరియు మహిళా పోలీసులు అధికారులు సచివాలయ సిబ్బంది సహాయంతో ఈ సర్వేను పూర్తి చేయాలి. ఈ సర్వే ను ఫిబ్రవరి 28 , 2025 లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడమైనది
How to Find Children Without Aadhaar?
సర్వే ఆప్షను ఓపెన్ చేసిన తర్వాత సచివాలయ పరిధి , గ్రామ పరిధి కాకుండా ఆ యొక్క సెక్టార్ పరిధిలో ఉన్నటువంటి పిల్లల వివరాలన్నీ కూడా వస్తున్నాయి. అందులో గ్రామం పేరు ఇచ్చినప్పటికీ వారి యొక్క వివరాలు తప్పుగా ఉండే అవకాశం ఉంది కావున , సర్వే చేయువారు మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు , ఊర్లో ప్రజలు విషయాలు అవగాహన ఉన్నటువంటి పెద్దలు , వీరిని కాంటాక్ట్ అయ్యి పేర్లను తెలియజేసినట్లు అయితే వారి క్లస్టర్ ఏంటి ఎక్కడ ఉంటారు అనే విషయాలు తెలుస్తుంది.
ముందుగా లిస్ట్ లో ఉన్నటువంటి మీ గ్రామం పేరుతో ఉన్నటువంటి పేర్లను ఒక పేపర్ పై నోట్ చేసుకోండి . తర్వాత పైన చెప్పిన వారి ద్వారా వారి యొక్క మొబైల్ నెంబర్ను పక్కన నోట్ చేసుకొని , వారికి ఫోన్ చేయడం గాని లేదా నేరుగా వారిని కాంటాక్ట్ అవ్వడం గాని అవ్వండి. ఫోన్ చేసి పిల్లల పేర్లు ధృవీకరించి వారికి ఆధార్ కార్డు వచ్చిందా రాలేదా ? , దరఖాస్తు చేశారా లేదా ? , , పుట్టిన సర్టిఫికెట్ ఉందా లేదా ? అనే విషయాలను కనుక్కొని యాప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది . ఈ విధంగా లిస్టులో ఉన్నటువంటి పెండింగ్ వారివి సర్వే వేగవంతంగా అయ్యే అవకాశం ఉంది.

ఈ విధంగా వివరాలు సబ్మిట్ చేసినట్లయితే ఆధార్ కార్డు లేనటువంటి పిల్లల వివరాలు, పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేనటువంటి వివరాలు , రెండు ఉండి ఆధార్ కార్డు పొందనటువంటి వారి వివరాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి . దీని ద్వారా గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా , పోస్ట్ ఆఫీస్ , ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా ఆధార్ క్యాంపులు నిర్వహించే సమయంలో వీరికి ప్రాధాన్యతతో కొత్త ఆధార్ కార్డులు చేయుటకు ప్రభుత్వం కసరత్తు చేయనుంది .
How to Do Children Without Aadhaar Survey ?
Step 1 : ముందుగా గ్రామ లేదా వార్డు సచివాలయం ఉద్యోగులు కింద ఇచ్చిన అధికారిక మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Step 2 : మొబైల్ యాప్ లో User ID కింద సచివాలయం కోడ్ – ఉద్యోగ హోదా ఎంటర్ చేసి బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఐరిస్ ద్వారా లాగిన్ అవ్వాలి.
Step 3 : హోం పేజీలో ఉన్నటువంటి Children Without Aadhaar అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

Select Cluster వద్ద ఏదో ఒక క్లస్టర్ ఎంచుకోవాలి.

ప్రస్తుతానికి వివరాలు క్లస్టర్ వారిగా ఇవ్వలేదు మొత్తం ఏ క్లస్టర్ ఎంటర్ చేసిన అన్ని వివరాలు ఓపెన్ అవుతున్నాయి .
Step 4 : ఎంటర్ చేసిన వెంటనే కింద చూపినట్టుగా మొత్తం సెక్టార్ పరిధిలో పెండింగ్ ఉన్నటువంటి పిల్లల వివరాలనేవి వస్తున్నాయి
- బిడ్డకు పేరు పెట్టినట్టయితే పేరు వస్తుంది లేకపోతే Baby Of అని చెప్పి తల్లి పేరు వస్తుంది,
- లింగము ,
- తల్లి పేరు,
- తల్లి ఆధార్ చివరి 4 అంకెలు ,
- అంగన్వాడి పేరు,
- అంగన్వాడి కోడ్ వివరాలనేవి వస్తున్నాయి

దానికి అనుగుణంగా సంబంధిత ANM లేదా మహిళా పోలీస్ వారు లేదా ఇతర సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు , ఆశ వర్కర్లు, గ్రామ విషయాలు తెలిసిన పెద్దలు ఈ వివరాలు అడిగినట్లయితే వారు ఎక్కడ ఉంటారు ? వారి యొక్క ఫోన్ నెంబర్ ? తదితర వివరాలు చెప్తారు.
Step 5 : వివరాలు నమోదుకు అందుబాటులో ఉన్న వారి యొక్క సెక్షన్ పై క్లిక్ చేసినట్లయితే మొదటగా

పిల్లవాడికి ఆధార్ కార్డు ఉన్నదా ? అని ప్రశ్న అడుగుతుంది అక్కడ ఉంటే Yes అని లేకపోతే No సబ్మిట్ చేయాలి . ఉన్నట్లయితే ఆధార్ నెంబరు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు లేనివారికి పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఉందా లేదా ? అని అడుగుతుంది ఉంటే Yes అని లేకపోతే No అని పెట్టి సబ్మిట్

Step 6 : చేసేటప్పుడు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఫేసు లేదా ఓటీపీ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది.

ఈ విధంగా సచివాలయ పరిధిలో పెండింగ్ ఉన్నటువంటి అన్ని పేర్లను Children Wit hout Aadhaar Survey Last Date ఫిబ్రవరి 28 , 2025 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది . పూర్తి చేసిన వన్నీ కూడా Green కలర్ లో ఉంటాయి పెండింగ్ ఉన్నవన్నీ కూడా Gray కలర్ లో ఉంటాయి.

ఎంత సర్వే చేశారు అని వివరాలు కోసం కింద ఆప్షన్ పై క్లిక్ చేయండి .

Leave a Reply