Beneficiaries in AP can now check their house hold mapping details online directly using their aadhar and linked mobile numbers.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండే ప్రజలను కుటుంబాల వారీగా HH mapping ద్వారా వారి వివరాలను పొందు పరచడం జరిగింది.
పలు సంక్షేమ పథకాలకు ఈ House Hold మాపింగ్ లో డేటా అవసరం.
లబ్ధిదారులు ఇప్పుడు నేరుగా ఆన్లైన్ లో తమ కుటుంబ పెద్ద ఆధార్ ఎంటర్ చేసి వివరాలను చెక్ చేసుకోవచ్చు,
హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉన్నారు? మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏ మండలంలో, ఏ సచివాలయ పరిధి లో వాలంటీర్ కి మ్యాప్ చేశారు. మీ హౌస్ హోల్డ్ మాప్పింగ్ లో పేరు మరియు జెండర్ సరిగా ఉందా లేదా ఈ వివరాలు కింది విధంగా తెలుసుకోండి
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
Link: https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/PublicNavasakamScreen
Step 2 : పై లింక్ పైన క్లిక్ చేసిన తరువాత కింది విదంగా సైట్ ఓపెన్ అవుతుంది
Step 3 : మీ ఆధార్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న GET DETAILS పైన క్లిక్ చేయండి
Step 4 : ఇప్పుడు మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ ఆధార్ కి లింక్ అయినా మొబైల్ నంబర్ ఇవ్వండి.మొబైల్ మరియు capcha కోడ్ ఎంటర్ చేసి send OTP పైన క్లిక్ చేయాలి
ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది
Step 5 : ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 4 అంకెల OTP ఎంటర్ చేయండి. VERIFY OTP పైన క్లిక్ చేయండి
ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది
Step 5: పై మెసేజ్ పైన OK అని క్లిక్ చేసాక మీ ఫ్యామిలీ వివరాలు అన్ని ఇలా ఓపెన్ అవుతాయి
Leave a Reply