రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఇప్పటివరకు వివరాలు నమోదు చేసుకోని వారి కోసం టోల్ ఫ్రీ నంబరు 040 2111 1111ను జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. సర్వేలో పాల్గొనని వారు.. ఆ నంబరుకు ఫోన్ చేసి పేరు, చిరునామా, పిన్‌కోడ్, వార్డు, ఫోన్ నంబరు వివరాలను తెలియజేయాలి. వాటి ఆధారంగా జీహెచ్‌ఎంసీ ఆ ఇంటికి అధికారులను పంపిస్తుంది.
ఈనెల16 నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. టోల్ ఫ్రీనంబరు కంట్రోల్‌రూము సిబ్బందికి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్ వెలుపల నుంచి ఫోన్ చేసే వారి వివరాలను కూడా నమోదు చేసుకోవాలని జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ సూచించారు.
Leave a Reply