BUDGET 2023 – ఆదాయపు పన్ను చెల్లించే వారికి బిగ్ న్యూస్..భారీ మార్పులు ఇవే

BUDGET 2023 – ఆదాయపు పన్ను చెల్లించే వారికి బిగ్ న్యూస్..భారీ మార్పులు ఇవే

ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు గుడ్ న్యూస్….ఇప్పటి వరకు 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి కొత్త ఆదాయపు పన్ను చట్టం(New Tax Regime) ప్రకారం ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ పరిమితి ని 7 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు.

ఈ పరిమితి పెంపు ఏప్రిల్ 2023 నుంచి వర్తిస్తుంది. అంటే ఏప్రిల్ నుంచి 7 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఎటువంటి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు

ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని 2.5 నుంచి 3 లక్షలకి పెంచిన కేంద్రం.

అంటే, ప్రస్తుతం అన్ని స్లాబుల వారికి 2.5 లక్షల ఆదాయం వరకు పన్ను రాయితీ వర్తిస్తుంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం అనగా ఏప్రిల్ 2023 నుంచి ఈ పరిమితి 3 లక్షలు గా ఉండనుంది.

Income Tax కొత్త స్లాబ్లులుఇవే

  • 0-రూ.3 లక్షలు: పన్ను లేదు
  • రూ.3 లక్షలు-రూ. 6లక్షలు: 5% పన్ను
  • రూ.6 లక్షలు-రూ.9 లక్షలు: 10% పన్ను
  • రూ.9 లక్షలు-రూ.12 లక్షలు: 15% పన్ను
  • రూ.12 లక్షలు-రూ.15 లక్షలు: 20% పన్ను
  • రూ.15 లక్షలు-ఆపైన ఆదాయం: 30% పన్ను

అంతే కాకుండా, ITR అనగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ వ్యవధిని 20-45 రోజుల నుంచి 15 రోజుల కు తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page