భారత రిజర్వ్ బ్యాంక్ రేపో రేటు కి అనుగుణంగా పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణాల) పై రేట్లు ఆధార పడి ఉంటాయి.
అయితే డిపాజిట్ ల మాదిరి వీటికి ఫిక్స్డ్ వడ్డీ రేటు ఉండదు. కొంత గరిష్ట , కనిష్ట పరిమితులు మాత్రమే ఉంటాయి.
వ్యక్తిగత రుణాలు సాధారణంగా రుణం తీసుకునే వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ మరియు ఇతర అంశాలపై ఆధార పడి ఉంటాయి.
పర్సనల్ లోన్ తక్కువ వడ్డీకి లభించడానికి కింది అంశాలు ముఖ్యం
✓ మీ క్రెడిట్ స్కోర్ – Cibil, Experian వంటి సంస్థలు ఈ స్కోర్ ఇస్తాయి. మీ లోన్ వాయిదాల చెల్లింపులు సకాలంలో ఉన్నాయా, క్రెడిట్ కార్డుల వాడకం సరిగా ఉందా తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ స్కోరును ఇస్తాయి. గరిష్టంగా 900 వరకు ఈ స్కోర్ ఉంటుంది. 770 పైన మెయింటైన్ చేస్తే చాలా మంచిది.
✓ మీ ఆదాయం – ఎక్కువ వార్షిక ఆదాయం ఉంటే అంత త్వరగా లోన్ పుడుతుంది. ముఖ్యంగా శాలరీ పొందే వారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి.
✓ మీరు పని చేసే కంపెనీ – మీకు ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ, మీరు పని చేసే కంపెనీ గుర్తింపు ఉన్న సంస్థ అయితే త్వరగా లోన్ సంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంత బిజినెస్ కంటే ఏదైనా కంపెనీ లో ఉద్యోగ రీత్యా స్థిర ఆదాయం ఉన్న వారికి ఈ ఛాన్స్ ఎక్కువ
✓ బ్యాంక్ తో మీకు ఇప్పటికే ఉన్న సంబంధం – మీరు లోన్ కి అప్లై చేస్తే, మీ బ్యాంక్ ఖాతా గానీ, క్రెడిట్ కార్డ్ వంటివి కానీ మీరు అప్లై చేసిన బ్యాంకులో ఉంటే మిమ్మల్ని నమ్మడం ఇంకా తేలిక అవుతుంది. అసలు మీ శాలరీ అకౌంట్ ఏ ఆ బ్యాంక్ లో ఉంటే చాలా ఈజీ గా లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది.
ఏ బ్యాంక్ ఎంత వడ్డీ తో వ్యక్తిగత రుణాలు ఇస్తుంది
బ్యాంకుల వారీగా ఎంత వడ్డీకి బ్యాంకులో పర్సనల్ లోన్స్ మంజూరు చేస్తున్నాయో కింది పట్టికలో చూడవచ్చు. అయితే ఈ వడ్డీ అనేది పైన పేర్కొన్న విధంగా మీ క్రెడిట్ స్కోర్ మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Lenders | Interest Rate (p.a.) | Processing Fee (% of loan amount) |
State Bank of India | 11.00% – 15.00% | Up to 1.50% (Rs 1,000 – Rs 15,000) |
HDFC Bank | 10.50% onwards | Up to Rs 4,999 |
Punjab National Bank | 10.40% – 16.95% | Up to 1% |
ICICI Bank | 10.75% onwards | Up to 2.5% |
Bank of Baroda | 10.90% – 18.25% | Up to 2% (Rs 1,000 – Rs 10,000) |
Union Bank of India | 11.40% – 15.50% | Up to 1% (Maximum Rs 7,500) |
Axis Bank | 10.49% onwards | 1.5% – 2% |
Bank of India | 10.25% – 14.75% | Up to 1% (Maximum Rs 5,000) |
Indian Bank | 10.00% – 15.00% | Up to 1% |
Kotak Mahindra Bank | 10.99% onwards | Up to 3% |
Central Bank of India | 10.95% – 12.55% | Up to 1% |
Canara Bank | 11.75%- 16.25% . | Up to 1% |
IndusInd Bank | 10.49% onwards | Up to 3% |
IDBI Bank | 11.00% – 15.50% | 1% (Minimum Rs 2,500) |
Yes Bank | 10.99% onwards | – |
UCO Bank | 12.45% – 12.85% | 1% (Minimum Rs 750) |
Federal Bank | 11.49% – 14.49% | Up to 3% |
Bank of Maharashtra | 10.00% – 12.80% | 1% |
IDFC FIRST Bank | 10.49% onwards | Up to 3.5% |
Bajaj Finance | 11.00% onwards | Up to 3.93% |
RBL Bank | 17.50% – 26.00% | Up to 2% |
Muthoot Finance | 14.00% – 22.00% | – |
Citibank | 10.75% – 16.49% | Up to 2% |
ముఖ్య గమనిక : ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. మీకు రుణం శాంక్షన్ చేయడం, చేయకపోవడం లేదా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవడం వంటివి బ్యాంక్ సొంత నిర్ణయం మేర ఉంటుంది. కాబట్టి బ్యాంకు ను సంప్రదించి అన్ని విషయాలు చర్చించి మీకు నచ్చిన బ్యాంకు, నచ్చిన వడ్డీకే మీరు లోన్ పొందవచ్చు.
Leave a Reply