బ్యాంక్ ఉద్యోగులకు సంబంధించి 5 రోజుల పని దినాలు వర్తింపచేయాలని చాల కాలంగా వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ త్వరలో నెరేవేరేలా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి చక చక అడుగులు పడుతున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బ్యాంకు ఉద్యోగులు ప్రతి ప్రత్యామ్నాయ శనివారాల్లో(Alternative Saturdays ) పని చేస్తున్నారు. అంటే 2 వ మరియు 4 వ శనివారం మినహా మిగిలిన వారాలు శనివారం కూడా పని చేస్తున్నారు.
దీనిపై ఐటి ఉద్యోగుల తరహా లోనే బ్యాంక్ ఉద్యోగులకు కూడా 5 రోజుల పని దినాలను కల్పించాలని ఇటీవల బ్యాంక్ ఉద్యోగులు , బ్యాంక్ సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. వీరి ప్రతిపాదనలను ఎట్టకేలకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ IBA పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మీడియా నివేదికల ప్రకారం సూత్రప్రాయంగా ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం.
IBA ఆమోదించాక RBI కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనలు ఆమోదించబడిన తర్వాత, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవు దినాలుగా పరిగణించాలి.
తద్వారా బ్యాంక్ ఉద్యోగులకు త్వరలో 2 రోజుల వీక్లీ ఆఫ్‌లు లభించే అవకాశం ఉంది, అయితే, 5 రోజుల పని వారంలో పని గంటలను ప్రతిరోజూ 50 నిమిషాలు పెంచవచ్చని నివేదికలు పేర్కొన్నాయి.
దీనికి సంబంధించి IBA మరియు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (UFBEs) మధ్య చర్చలు జరుగుతున్నాయి మరియు అసోసియేషన్ 5 రోజుల పని వారానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం, బ్యాంకు ఉద్యోగులు ప్రత్యామ్నాయ శనివారాల్లో పని చేస్తున్నారు. ఇక వీరికి సెలవు ప్రకటిస్తే ఆ రోజు బ్యాంకులకు కూడా సెలవు ఉండనుంది అంటే ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే పని చేస్తాయన్నమాట.
అయితే పైన పెర్కున్న విధంగా వారి పని గంటల్లో ఈ విధంగా మార్పులు ఉండే అవకాశం ఉంది , ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 9.45 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అంటే 40 నిమిషాలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.
ఏది ఏమైనా ఎట్టకేలకు బ్యాంక్ ఉద్యోగులు మరియు యూనియన్ల డిమాండ్లు త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Leave a Reply