దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ పేరుతో ఆరోగ్య క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పక్షం రోజులపాటు నిర్వహించడం జరుగుతుంది.
ఈ క్యాంపెయిన్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మెడికల్ కాలేజీల స్థాయిలలో ఆరోగ్య మేళా లను నిర్వహించనున్నారు. ఈ మేళాల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు ఇవ్వడం, కార్డులు పంపిణీ వంటివి చేస్తారు. అవసరమైన వారికి టెలికాన్సల్టేషన్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. అంటే ఇంటి వద్దనే ఉండి సంబంధిత వైద్య నిపుణులతో మాట్లాడవచ్చు.
ఆయుష్మాన్ ఆప్ కే 3.0 ద్వారా ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డులను అందిస్తారు.
ఆయుష్మాన్ సభల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలను హాజరు పరిచి వారికి ఆరోగ్య పథకాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు, ఆయుష్మాన్ కార్డులను కూడా జారీ చేస్తారు.
క్యాన్సర్, వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం టీబి వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించడం వంటివి ఇందులో భాగం.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాలను నిర్వహించి , రక్తదానం చేయడానికి ముందుకు వచ్చే వాలంటీర్లను నమోదు చేసుకుని అవసరమైనప్పుడు వారిని సంప్రదించడం జరుగుతుంది.
ముఖ్యమైన లింక్స్..
Leave a Reply