ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ గుడ్ న్యూస్.. ఉచితంగా బీమా సదుపాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు.
70 ఏళ్లు పైబడిన వారందరికీ ఐదు లక్షల ఉచిత బీమా [ Ayushman Bharat Registration for 70+]
దేశవ్యాప్తంగా 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఐదు లక్షల రూపాయల మీద ఉచిత బీమా సదుపాయాన్ని కల్పించే పథకానికి కే ప్రధానమంత్రి మంగళవారం శ్రీకారం చుట్టారు.
ఇకపై ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఐదు లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తారు.
ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన పథకం కింద ఈ ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఐదు లక్షల బీమా వర్తిస్తుంది.
ఇప్పటికే ఆయుష్మాన్ కార్డు కలిగి ఉన్నవారికి ఈ ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తారు. ఒకవేళ ఆయుష్మాన్ కార్డు లేని వారికి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా కొత్త కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది.
ఈ విధంగా దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల పైగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే కుటుంబ ప్రాతిపదికన ఏట ఐదు లక్షల వరకు ఈ బీమా వర్తిస్తుంది. ఒకవేళ ఒకే కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరు ఉంటే సగం సగం బీమా వారికి వర్తిస్తుంది.
ప్రస్తుతమా ఆయుష్మాన్ భారత్ కార్డులో కుటుంబానికి ఇస్తున్నటువంటి బీమా కి గాను 70 ఏళ్లు పైబడిన వారికి అదనంగా 5 లక్షల కవరేజ్ అనేది కల్పించడం జరిగింది.
ఆయుష్మాన్ భారత్ PMJAY అర్హతలు ఏమిటి?
ఆయుష్మాన్ భారత్ పిఎంజెఏవై కింద వృద్ధులకు ఉచిత ఐదు లక్షల బీమా పొందాలనుకునే వారికి అర్హతలు ఇవే..
- సదరు లబ్ధిదారుడు భారతదేశ పౌరుడై ఉండి శాశ్వత నివాసి అయి ఉండాలి.
- ఐదు లక్షల అదనపు కవరేజ్ పొందాలి అంటే తప్పనిసరిగా 70 ఏళ్లు నిండాలి.
- అన్ని ఆర్థిక మరియు సామాజిక వర్గాల వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
ఆయుష్మాన్ భారత్ పీఎంజేవై కింద 70 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసే విధానం – PMJAY Registration Process for Senior citizens
70 ఏళ్ళు పై పడినవారు ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఐదు లక్షల ఉచిత బీమా పొందేందుకు కింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముందుగా ఇక్కడ ఇవ్వబడినటువంటి PMJAY వెబ్సైట్ ను సందర్శించాలి.
- ఇందులో Enroll for PMJAY 70+ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. పైన ఇవ్వబడిన ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో captcha , మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లక్ చేస్తే మీకు OTP వస్తుంది, ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
4. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో లాస్ట్ లో click here to enroll సీనియర్ సిటిజన్ ఎన్రోల్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి.
5. పైన ఇవ్వబడిన ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కింది విధంగా ఆధార్ నంబర్ ఫ్యామిలీ ఐడి మరియు captcha అడుగుతుంది. ఫ్యామిలీ ఐడి చాలామందికి తెలియదు కాబట్టి అది అవసరం లేదు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ పైన క్లిక్ చేయండి.
6. Search పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ కూడా కనిపిస్తాయి. అందులో ఎన్రోల్ అయ్యారా లేదా కూడా చూపిస్తుంది. ఎవరినైతే మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటున్నారో వారి పేరు మీద క్లిక్ చేస్తే వారి ఎన్రోల్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
7. పైన ఆధార్ నంబర్ వెరిఫై చేసి ఆధార్ ఓటిపి ఎంటర్ చేసి మీరు ఎన్రోల్మెంట్ పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత మీకు ఆయుష్మాన్ కార్డు జనరేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆయుష్మాన్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని ఐదు లక్షల బీమా సదుపాయాన్ని సులభంగా పొందవచ్చు.
వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి ప్రాసెస్ కింది వీడియో ద్వారా చూడవచ్చు.
Leave a Reply