బ్యాంకింగ్ రంగంలో సరికొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టడం లో బ్యాంకులు పోటీపడుతున్న విషయం మనకు తెలిసిందే. అది ఇలాంటి ప్రయోగమే కొత్తగా యాక్సిస్ బ్యాంక్ చేసింది. పూణే కు చెందిన పింటెక్ స్టార్ట్ అప్ fibe తో కలిసి ఒక సరి కొత్త క్రెడిట్ కార్డును ప్రారంభించింది.
ఈ క్రెడిట్ కార్డు పై నంబర్లు ఉండవు, సివివి ఉండదు
మనం నిత్యం క్రెడిట్ కార్డులను వాడుతూ ఉంటాం. ఈ క్రెడిట్ కార్డ్ అన్నిటికీ కూడా నంబర్ ఉంటుంది. ఈ నెంబర్ కి సంబంధించి ఒక సీక్రెట్ సి వి వి కోడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం ఎంటర్ చేస్తేనే ఆ క్రెడిట్ కార్డును ఉపయోగించగలం.
అయితే ఇటీవల టాప్ ఎండ్ పే ఆప్షన్ ద్వారా మనం క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయకుండానే offline పేమెంట్ చేస్తున్నాం.
వీటన్నిటికీ అసలు నంబర్ మరియు సి వి వి లేని సరికొత్త క్రెడిట్ కార్డును Axis Bank తీసుకువచ్చింది. Fibe అనే స్టార్టప్ తో కలిసి దీనిని ప్రారంభించింది. అది కూడా అదిరిపోయే బెనిఫిట్స్ తో దీనిని అందిస్తున్నారు. ఈ కార్డు పొందటానికి ఎటువంటి joining లేదా annual ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం 21 లక్షల మంది fibe కస్టమర్లకు ఈ కార్డును జారీ చేస్తున్నారు.
ఫైబ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ [Fibe-Axis Credit Card Benefits]
- ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్, క్యాబ్ సర్వీస్, పలు టికెట్ ప్లాట్ ఫామ్ లో జరిగే ట్రాన్సాక్షన్ల పై 3% క్యాష్ బ్యాక్.
- ఇతర ఆన్లైన్ ఆఫ్లైన్ లావాదేవీలపై 1% క్యాష్ బ్యాక్.
- Rupay varient లో ఈ కార్డ్ అందించబడుతుంది, కాబట్టి UPI కి లింక్ చేసి క్రెడిట్ కార్డ్ తో చెల్లింపులు చేయవచ్చ.
- డొమెస్టిక్ విమానాశ్రయాలలో ఏడాదికి నాలుగు సార్లు ఉచితంగా launge సేవలను పొందవచ్చు.
- Fuel surcharge పై రాయితీ లభిస్తుంది.
- టాప్ ఎండ్ పే ఆప్షన్ కలదు మరియు ఈ కార్డ్ పూర్తి గా ఉచితం. ఎటువంటి జాయినింగ్ లేదా అన్యువల్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
Leave a Reply