ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
మీడియాతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ అవార్డులను మరియు రివార్డులను ఇవ్వనున్నట్టు తెలిపారు.
మంచి మార్కులు సాధించిన టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం కోసం ఈ అవార్డులు అందించనున్నట్టు మంత్రి తెలిపారు.
ఈనెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి అవార్డులు రివార్డులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ఈ నెల 27న జిల్లాస్థాయిలో అత్యధిక మార్కుల సాధించిన టెన్త్ మరి ఇంటర్ విద్యార్థులకు అవార్డులు అందించినున్నట్టు స్పష్టం చేశారు.
ఈ నెల 31న రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, ప్రిన్సిపాల్, హెడ్మాస్టర్, అధ్యాపకులను సత్కరించనున్నారు. సుమారు 2831 మందిని సత్కరించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గం స్థాయిలో ప్రతిభ చెప్పిన విద్యార్థులకు పథకం మరియు మెరిట్ సర్టిఫికెట్
జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థికి 50,000, రెండవ ర్యాంకు విద్యార్థికి 30000, మూడో ర్యాంకు విద్యార్థికి 10000 అందించనున్నారు.
రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన విద్యార్థికి లక్ష రూపాయలు, రెండవ ర్యాంకు వచ్చిన వారికి 75,000 మూడో ర్యాంకు వచ్చిన వారికి 50,000 నగదును బహుమతిగా అందించనున్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు
Leave a Reply