అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా లబ్ది పొందాలనుకునే వారికి ముఖ్య సూచన..
ఇక పై ఆదాయ పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరేందుకు అనర్హులు. ఈ పథకం నిబంధనలను సవరిస్తూ కేంద్రం ఉత్తర్వులు.
అయితే ఇప్పటికే ఈ పథకం లో చేరిన వారికి ఈ నిబంధన వర్తించదు.
ఒకవేళ ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లించే వారు అక్టోబర్ తరువాత ఇందులో జోయిన్ అయితే వారి ఖాతా ను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
అసలు అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి ?
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడుతున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. . పీఎఫ్ఆర్‌డీఏ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఇందుకోసం బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, ఆధార్ కార్డు , మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ స్కీమ్‌లో చేరిన వారు నెలకు కొంత అమౌంట్ చెల్లించాలి. ఆ విధంగా చెల్లిస్తే వారికి 60 ఏళ్ళు దాటినా తరువాత ప్రతి నెల రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ 4 వేలు చొప్పున కూడా పెన్షన్ వస్తుంది. మీరు చెల్లించే మొత్తం ప్రాతిపదికన పెన్షన్ డబ్బులు మారతాయి.
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరే వారికి 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. రూ.1000 పెన్షన్ కోసం నెలకు రూ. 42 చెల్లించాలి. రూ. 5 వేల పెన్షన్ కోసం రూ.210 కట్టాలి. వయసు పెరిగితే ఈ మొత్తం కూడా పెరుగుతోంది.
Below is the detailed chart of Premium and corresponding pension under APY
Leave a Reply