ఏప్రిల్ 1 నుంచి (2023-2024) కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో కేవలం 15 రోజులే పనిచేయనున్నాయి! ఆదివారాలతో పాటు లోకల్ హాలిడేస్, రెండవ – నాల్గవ శనివారాలు సహా 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంకు పనుల కోసం తిరిగే వారు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఏప్రిల్ నెలకు సంబంధించిన సెలవుల లిస్టును ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసింది. సెలవులను బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ నెలలోని బ్యాంకు సెలవులు
ఏప్రిల్ 1, 2023:- బ్యాంక్స్ యాన్యువల్ క్లోజింగ్. ఐజ్వాల్, షిల్లాంగ్, శిమ్లా, ఛండీగఢ్లోని బ్యాంకులకు సెలవు. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు బ్యాంకులు పని చేస్తాయి అయితే శనివారం టైమింగ్స్ వర్తిస్తుంది.
ఏప్రిల్ 2, 2023:- ఆదివారం.
ఏప్రిల్ 4, 2023:- మహావీర్ జయంతి. అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, ఛండీగఢ్, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, రాయ్పూర్, రాంఛీ బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 5, 2023:- జగ్జీవన్ రామ్ జయంతి. హైదరాబాద్, తెలంగాణ లోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 7, 2023:- గుడ్ ఫ్రైడే. తెలుగు రాష్ట్రాల్లో సెలవు. అగర్తలా, అహ్మదాబాద్, గౌహతీ, జైపూర్, జమ్ము, శిమ్లా, శ్రీనగర్ మినహా.. దేశవ్యాప్తంగా అన్న బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 8, 2023:- రెండో శనివారం సెలవు
ఏప్రిల్ 9, 2023:- ఆదివారం సెలవు
ఏప్రిల్ 14, 2023:- అంబేడ్కర్ జయంతి.తెలుగు రాష్ట్రాల్లో సెలవు. భోపాల్, ఢిల్లీ, రాయ్పూర్, షిల్లాంగ్, శిమ్లా మినహా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 15, 2023:- విషు, బహగ్, బిహు, హిమాచల్ డే, బెంగాళీ నూతన ఏడాది ప్రారంభం. అగర్తలా, గౌహతీ, కొచ్చి, కోల్కతా, శిమ్లా, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 16, 2023:- ఆదివారం సెలవు.
ఏప్రిల్ 18, 2023:- సాబ్ ఇ కద్ర్. జమ్ముకశ్మీర్ బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 21, 2023:- ఈద్- ఉల్- ఫితర్. త్రిపుర, జమ్ముకశ్మీర్, కేరళలో బ్యాంకులకు సెలవు.
ఏప్రిల్ 22, 2023:- నాలుగో శనివారం సెలవు
ఏప్రిల్ 23, 2023:- ఆదివారం
ఏప్రిల్ 30, 2023:- ఆదివారం
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వారాంతపు సెలవులు కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి.
Leave a Reply