April 2025 Month NTR Bharosa Pension Guidelines: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు పింఛను తీసుకోవడానికి ప్రతి నెలా ఊరికి రావాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తారు. దివ్యాంగుల కోటాలో రూ. 6 వేల నుంచి రూ. 15 వేల వరకు పింఛను పొందుతున్నవారు ఉన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పింఛన్లు పంపిణీ బాధ్యతలను గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు.

ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణి సూచనలు
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకాన్ని ప్రభుత్వం ప్రచార విధానంలోకి చేర్చింది. పింఛన్ల పంపిణీలో నాణ్యతను మరియు పింఛనుదారుల యొక్క సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి పింఛను పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఈ క్రింది మార్పులు చేయబడ్డాయి
- ఏప్రిల్ 1 నుంచి దివ్యాంగ విద్యార్థుల పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ.
- పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగకుండా కొత్తగా ఎల్-1 ఆర్డీ స్కానర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ
- మొబైల్ యాప్‌లో చెల్లింపులు ఉదయం 6:30 గంటల వరకు ప్రారంభించబడతాయి మరియు చెల్లింపులు ఉదయం 7 గంటల నుండి పూర్తి చేయాలి.
- పింఛను పంపిణీ మొబైల్ అప్లికేషన్లో ఆడియో సందేశం (20 సెకన్లు) చిత్తూరు మరియు కర్నూల్ జిల్లా లో ప్రవేశపెట్టడం జరిగినది. పింఛను పంపిణీ చేస్తున్నప్పుడు, పింఛనుపంపిణీ చేసే అధికారులు వృద్ధ పింఛనుదారులకు నమస్కారాలు తెలియజేయాలి. పింఛనుదారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడానికి, పంపిణీ ప్రక్రియలో పింఛనుదారుల కోసం ఆడియో సందేశం వినిపించవలెను.
- పింఛనుదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ: పింఛనుదారుల ఇంటి దగ్గర నుంచి 300మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛను పంపిణీ జరిగినప్పుడు పింఛనుదారుల ఇంటినుండి పంపిణీ చేయు ప్రదేశం మద్య దూరం మొబైల్ అప్లికేషన్లో చూపించడును.
- పింఛన్లు పంపిణీ చేసే అధికారులు 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పింఛను పంపిణీ చేయదలచిన కారణాలను మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసి పింఛను పంపిణీని చేయవలెను.
- పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే కింది కారణాలలో ఏదోకటి సెలెక్ట్ చేసుకోవాలి
- Hospitalized
- At Old age Home
- Transferred from other secretariat
- Disabled Student at School/College
- Pensioner Came to Secretariat Location
- Due to signal problem at pensioner’s house
- At NREGS Worksite
- Pensioner residing at relative’s house
- పింఛనుదారుల సౌలభ్యం కొరకు పింఛను పంపిణీ ఉదయం 6.00 గంటలకు బదులుగా ఉదయం 7.00 గంటలకు ప్రారంభించవలెను.
- పింఛను పంపిణీ చేసే ఆధికారులు, పై సూచనలను పాటించి పింఛనుదారులకు అత్యంత సంతృప్తికరంగా పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించడమైనది.
- మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు.
- మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ & సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ టామ్, బహిరంగ ప్రదేశాల్లోఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతిపింఛనుదారునికి చేరాలి.
- 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత, చెల్లించని మొత్తాన్నిరెండు రోజుల్లోపు SERPకి తిరిగి చెల్లించాలి.
- చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమసహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి.
- కింద ఇవ్వబడిన పది జిల్లాల పెన్షన్ పంపిణీ అధికారులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ 8.1 డౌన్లోడ్ చేసుకోవాలి (Download NTR Bharosa Pension App V8.1.1)
- ANANTHAPURAMU
- CHITTOOR
- TIRUPATI
- ANNAMAYYA
- SRI SATHYA SAI
- NANDYAL
- YSR
- KURNOOL
- SRI POTTI SRIRAMULU NELLORE
- PRAKASAM





పెన్షన్ వివరాలు
S.No | Category | Pension Amount (Rs.) | |
1 | వృద్ధాప్య పెన్షన్ | 4000 | |
2 | వితంతువు | 4000 | |
3 | చేనేత కార్మికులు | 4000 | |
4 | కళ్లు గీత కార్మికులు | 4000 | |
5 | మత్స్యకారులు | 4000 | |
6 | ఒంటరి మహిళలు | 4000 | |
7 | సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు | 4000 | |
8 | ట్రాన్స్ జెండర్ | 4000 | |
9 | ART(PLHIV) | 4000 | |
10 | డప్పు కళాకారులు | 4000 | |
11 | కళాకారులకు పింఛన్లు | 4000 | |
12 | వికలాంగులు | 6000 | |
13 | బహుళ వైకల్యం కుష్టు వ్యాధి | 6000 | |
III. పూర్తి అంగవైకల్య వికలాంగుల పెన్షన్ Rs.15000/- | |||
14 | పక్షవాతం వచ్చిన వ్యక్తి, వీల్ చైర్ లేదా మంచానికి పరిమితం అయిన వారు | 15000 | |
15 | తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు మరియు ప్రమాద బాధితులు | 15000 | |
16 | ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-Grade 4 | 10000 | |
17 | కిడ్నీ, కాలేయం మరియు గుండె మార్పిడి | 10000 | |
18 | CKDU Not on Dialysis CKD Serum creatinine of >5mg | 10000 | |
19 | CKDU Not on Dialysis CKD Estimated GFR <15 ml | 10000 | |
20 | CKDU Not on Dialysis CKD Small contracted kidney | 10000 | |
V. OTHER CATEGORIES | |||
21 | CKDU on Dialysis Private | 10000 | |
22 | CKDU on dialysis GOVT | 10000 | |
23 | సికిల్ సెల్ వ్యాధి | 10000 | |
24 | తలసేమియా | 10000 | |
25 | తీవ్రమైన హీమోఫిలియా (<2% of factor 8 or 9) | 10000 | |
26 | సైనిక్ సంక్షేమ పెన్షన్ | 5000 | |
27 | అభయహస్తం | 500 | |
28 | అమరావతి భూమి లేని నిరుపేదలు | 5000 |
అర్హత ప్రమాణాలు
పెన్షన్ | అర్హతలు |
---|---|
వృద్ధాప్య పెన్షన్ | 60 సంవత్సరాలు మరియు ఆపై వయస్సు కలవారు అర్హులు. గిరిజనులు 50 సంవత్సరాలు ఆపై వయస్సు కలవారు అర్హులు |
వితంతు పెన్షన్ | వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు ఆ పై వయస్సు కలవారు. భర్త మరణ ధ్రువీకరణ పత్రం లేదా డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి |
వికలాంగుల పెన్షన్ | 40% మరియు అంతకన్నా ఎక్కువ వికలత్వం కలిగి ఉన్నవారు మరియు సదరం సర్టిఫికెట్ కలిగి ఉన్న వారు. వీరికి వయోపరిమితి లేదు |
చేనేత కార్మికుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరాలు మరియు యు ఆ పైన కలవారు. చేనేత మరియు జౌళి శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు |
కల్లు గీత కార్మికుల పింఛన్ | వయస్సు 50 సంవత్సరాలు మరియు ఆపైన కలవారు. ఎక్సైజ్ శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు. |
మత్స్యకారుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరములు మరియు ఆ పైన కలవారు. మత్స్య శాఖ వారిచే గుర్తింపు పత్రం కలిగినవారు. |
హెచ్ఐవి(PL HIV) బాధితులు పెన్షన్ | వయో పరిమితి లేదు. ఆరు నెలలు వరుసగా ART treatment Therapy(యాంటీ రిట్రో వైరల్ థెరపీ) తీసుకున్నవారు. |
డయాలసిస్ (CKDU) పెన్షన్ | వయస్సుతో సంబంధం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకుంటూ ఉన్నవారు. ( స్టేజ్ 3, 4 & 5) వయో పరిమితి లేదు. |
ట్రాన్స్ జెండర్ పెన్షన్ | 18 సంవత్సరాలు ఆ పైన వయస్సు కలవారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి ధ్రువీకరణ పత్రం కలిగినవారు. |
ఒంటరి మహిళ పెన్షన్ | వయస్సు 35 సంవత్సరాలు మరియు ఆపైన కలిగి ఉండి, చట్ట ప్రకారం భర్త నుండి విడాకులు పొందినవారు, భర్త నుండి విడిపోయిన వారు (విడిపోయిన కాలవ్యవధి ఒక సంవత్సరం పైగా ఉండాలి.) గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు, భర్త నుండి విడిపోయినట్లు గా ఎటువంటి ధ్రువీకరణ పత్రం లేనివారు గ్రామ / వార్డు స్థాయిలో ప్రభుత్వ అధికారుల సాక్షాలతో తాసిల్దారుగారి ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అవివాహితులుగా ఉండి ఎటువంటి ఆదరణ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఉన్న వారు, గ్రామాలలో ఉన్న వారికి వయస్సు 30 సంవత్సరములు మరియు పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి వయస్సు 35 సంవత్సరాలు, ఆపైన కలిగి ఉండాలి. పెన్షన్ మంజూరు అనంతరం వారు వివాహం చేసుకుని ఉన్నా లేదా ఆర్ధిక పరముగా జీవనోపాధి పొందిన తక్షణమే పెన్షను నిలిపి వేసే బాధ్యత సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారి వారికి అనుమతి ఉన్నది. (ప్రతి నెల పెన్షన్ పంపిణీ అధికారి ఆమె పరిస్థితి పరిశీలించాలి.) |
డప్పు కళాకారుల పెన్షన్ | వయస్సు 50 సంవత్సరంలు మరియు ఆ పైన కలవారు. సాంఘిక సంక్షేమ శాఖ వారిచే గుర్తింపు పొందిన వారై ఉండాలి. |
చర్మకారుల పెన్షన్ | వయసు 40 సంవత్సరాలు మరియు ఆ పైన కలవారు. లబ్ధిదారుల జాబితా సాంఘిక సంక్షేమ శాఖ అందజేస్తుంది. |
అభయ హస్తం పెన్షన్ | స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి ఉండి, 60 సంవత్సరాల వయస్సు కలవారు. |





పెన్షన్ పంపిణీ సమయంలో ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ లు





Leave a Reply