APAAR Card: దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును మంజూరు చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డులా పని చేస్తూ ప్రభుత్వ పథకాలు ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతోంది. అలాగే దేశంలో ఉన్న విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం అపార్ (APAAR) అనే ఒక గుర్తింపు కార్డును జారీ చేస్తోంది.
జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా ఈ కార్డును 2026 -27 నాటికి” వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి” పేరుతో విద్యార్థుల వివరాలు ఒక కార్డులో నిక్షిప్తం చేసి అందరు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇంతకీ అపార్ కార్డు విద్యార్థులకు ఎందుకు ఉపయోగపడుతుంది ..ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి….తదితర వివరాలను తెలుసుకుందాం.
What is APAAR Card? – అపార్ కార్డు అంటే ఏమిటి
అపార్ అంటే “ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ రిజిస్ట్రీ”(అపార్), దీనిని”వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డు” అని కూడా అంటారు. అపార్ కార్డులను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్( ఏబిసి)ను ప్రారంభించింది. దీనిని ఎడ్యులాకర్ గా సూచిస్తారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఈ కార్డులను జారీ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడిన ఒక డిజిటల్ కార్డు. ఈ కార్డు ద్వారా విద్యార్థులు తమ విద్యా జీవితంలో డిగ్రీలు, క్రెడిట్స్, ఇతర సమాచారాన్ని ఆన్ లైన్ లో సులువుగా సేకరించుకోవచ్చు. ఈ కార్డును ఫ్రీ ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకూ ఆయా పాఠశాలలు, కళాశాలలు జారీ చేస్తాయి.
అపార్ కార్డు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? (How to register for an APAAR Card)
అపార్ కార్డు రిజిస్ట్రేషన్ ను ఆన్లైన్ ద్వారా పొందవలసి ఉంటుంది.
ఇందుకోసం ఏబిసి బ్యాంక్ వెబ్ సైట్ ను ఎంపిక చేసుకోవాలి.
మై అకౌంట్ పై క్లిక్ చేసి స్టూడెంట్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
డిజిలాకర్ అకౌంట్ తెరిచేందుకు సైన్ అప్ పై క్లిక్ చేయాలి.
మొబైల్ నెంబర్, చిరునామా, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసి, ఇతర వ్యక్తిగత ఆధారాలను ఉపయోగించి డిజిలాకర్ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి
కేవైసీ ధ్రువీకరణ కోసం ఏబీసీ తో ఆధార్ కార్డు వివరాలు పంచుకోవడానికి డిజి లాకర్ అనుమతి అడుగుతుంది.
అప్పుడు ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత విద్యార్థి చదివే పాఠశాల,కళాశాల పేరు, తరగతి, కోర్సులు, తదితర వివరాలు నమోదు చేయాలి.
వివరాలు సక్రమంగా నమోదు చేసిన తర్వాత సబ్మిట్ కొడితే అపార్ కార్డు రూపొందుతుంది.
అపార్ కార్డు ఎలా పొందాలి? (How to download APAAR Card)
ఆన్ లైన్ లో 12 అంకెల అపార్ కార్డు రూపొందించబడిన తర్వాత ప్రత్యేక గుర్తింపుతో ప్రతి విద్యార్థి ఆధార్ కార్డుకు లింక్ అయి అపార్ కార్డు ఉంటుంది.
దీనిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఏబిసి వెబ్సైట్ కు లాగిన్ అయి డాష్ బోర్డులో కనిపించే అపార్ కార్డు డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి.
విద్యార్థి వివరాలుతో కూడిన అపార్ కార్డు మోనిటర్ పై డిస్ ప్లే,అవుతుంది.
డౌన్ లోడ్, లేదా ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అపార్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది.
అపార్ కార్డు ప్రయోజనాలు (APAAR Card Benefits)
అపార్ కార్డు విద్యార్థులకు జీవితకాలం గుర్తింపు కార్డుగా ఉపయోగపడతుంది. విద్యార్థుల మొత్తం దత్తాంశాన్ని ఒకచోట నిల్వ చేస్తుంది.
ఒకవేళ విద్యార్థి చదువు మధ్యలో వేరొక పాఠశాలకు లేదా కళాశాలకు బదిలీ అయినా,కొత్త విద్యా సంస్థలో ప్రదేశం పొందాలన్నా సులువుగా చేరవచ్చు.
డ్రాప్ అవుట్లను గుర్తించవచ్చు. ఉపకార వేతనాలు, డిగ్రీలు, ఇతర ప్రతిభలకు సంబంధించిన మొత్తం వివరాలు డిజిటల్ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది.
ముఖ్యంగా దొంగ( ఫేక్) సర్టిఫికెట్లకు చెక్ పెడుతుంది. అయితే అపార్ కార్డు జారీ చేసేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
అపార్ కార్డు జారీలో ఇబ్బందులు (Issues in registering for APAAR Card)
విద్యార్థులకు అపార్ కార్డు నమోదు చేసే విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామానికి ప్రాంత విద్యార్థుల ఆధార్ కార్డులలో తప్పులు ఉండడమే ప్రధాన సమస్య.
ముఖ్యంగా విద్యార్థి పేరు,తండ్రి పేరు, స్పెల్లింగ్ ల తో విద్యార్థులు చదివే విద్యా సంస్థ అడ్మిషన్ రిజిస్టర్ లో ఒకలా, ఆధార్ కార్డులో మరోలా ఉండటంతో అపార్ కార్డు నమోదులో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
విద్యార్థుల ఆధార్ కార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆ కేంద్రాల్లో చిరునామా, ఇంటి నెంబర్ తదితర అంశాలను మాత్రమే మార్పు చేసున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ మార్పు చేసేందుకు బర్త్ సర్టిఫికేట్ ను ఆధార్ కేంద్ర నిర్వాహకులు అడుగుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎక్కువమంది విద్యార్థులు ఆసుపత్రిలో కాకుండా ఇళ్ల వద్ద పుట్టినట్లయితే వారికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్యనుకూడా ప్రభుత్వం పరిష్కరించి విద్యార్థులకు అపార్ కార్డు జారీ చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Leave a Reply