AP Work From Home New Survey 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసం Work From Home New Survey 2025 ని ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ITI, Diploma, Any Degree, Graduation, Post Graduation లేదా అంతకంటే ఉన్నత విద్యార్థులకే ఈ సర్వే వర్తిస్తుంది.
గతంలో నిర్వహించిన WFH Survey గురించి మీకు తెలుసా?
2023-24లో ప్రభుత్వం విద్యార్హతతో సంబంధం లేకుండా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ప్రతిఒక్కరిపై సర్వే జరిపింది. అయితే చాలా మంది విద్యార్హతలు లేని వారే ఉండటంతో ప్రభుత్వం ఎవరికి వాస్తవికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలో స్పష్టత రాలేదు. అందుకే 2025లో కొత్త విధానంతో WFH Survey ని పునఃప్రారంభించింది.
Work From Home New Survey 2025 – అర్హతలు ఎవరికీ?
- ITI, డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా ఇతర ఉన్నత విద్య పొందినవారు
- గ్రామ వార్డు సచివాలయాలలో ట్యాగ్ అయిన క్లస్టర్లలో పేర్లు ఉన్నవారు
- ఆధార్ నంబర్ ఆధారంగా సచివాలయ సిబ్బందిచే ధృవీకరణ పొందినవారు
సర్వే కోసం అవసరమైన డాక్యుమెంట్లు & వ్యక్తిగత వివరాలు
- ఆధార్ నంబర్
- మొబైల్ నెంబర్ (OTP వెరిఫికేషన్)
- ఈమెయిల్ ID (OTP వెరిఫికేషన్)
- చదువుకున్న కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్ (ఫోటో అప్లోడ్)
- పాస్ అయిన సంవత్సరం, పర్సంటేజ్, స్పెషలైజేషన్
- చదివిన ఇన్స్టిట్యూట్ పేరు మరియు లొకేషన్
- తెలిసిన భాషలు

AP GSWS Employees App ద్వారా సర్వే ప్రక్రియ
GSWS Employees Mobile App డౌన్లోడ్ చేసుకోవాలి

లాగిన్ అయిన తర్వాత Search by UID లేదా Search by Cluster ఎంపిక చేయాలి

అధికారుల క్లస్టర్ ఆధారంగా వ్యక్తిని వెతకాలి

Face, Iris, Biometric లేదా OTP ద్వారా ధృవీకరించాలి

మొబైల్, ఈమెయిల్ ఐడి ద్వారా OTP వెరిఫై చేయాలి

విద్యార్హతలు, సర్టిఫికెట్లు, ఇతర వివరాలు అప్లోడ్ చేయాలి
సర్వే సబ్మిట్ చేసిన తరువాత రిపోర్ట్ అప్‌డేట్ అవుతుంది
AP Work Form Home Survey New Quationaries in Telugu
తర్వాత కింద ప్రశ్నలు అడుగుతాయి.
- తెలిసిన భాషలు ఎన్ని అవి ఏంటి
- విద్య అర్హత ఏంటి
- విద్యా అర్హతలు స్పెషలైజేషన్ ఏమిటి
- వచ్చిన మార్కులు లేదా జిపిఏ ఎంత
- ఏ సంవత్సరం పాస్ అయ్యారు (పాస్ అయినట్టు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో అప్లోడ్ చేయాలి. బయట ఉంటే ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు లేదా ఫోన్లో ఉన్నట్లయితే అప్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. )
- ఎక్కడ చదువుకున్నారు లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అప్పుడు మరల పైన వివరాలన్నీ కూడా అడుగుతాయి.
- అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ యొక్క వివరాలను కూడా అవసరమైతే ఎంటర్ చేయవచ్చు అవసరం లేకపోతే అవసరం లేదు.

చివరగా సబ్మిట్ చేసినట్టయితే ఆ వ్యక్తికి ఈ సర్వే అనేది పూర్తి అవుతుంది.
AP Work From Home Survey Report ఎలా తెలుసుకోవాలి?
సర్వే రిపోర్టును జిల్లాల, మండలాల, సచివాలయాల, క్లస్టర్ల వారీగా ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అధికారిక లింక్ ద్వారా మీ జిల్లా & సచివాలయం ఎంచుకున్న తర్వాత మీరు రిపోర్ట్‌ను చూడగలరు.
ఈ కొత్త WFH Survey 2025 ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. కాబట్టి సర్వేలో పాల్గొనబోయే అభ్యర్థులు తప్పనిసరిగా సరైన వివరాలతో పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయాలి. భవిష్యత్‌లో ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలు రాబోయే సమయాల్లో మీ ఇంటి బాట పట్టే అవకాశాన్ని మీకు ఇవ్వవచ్చు. (Work from home job Andhra Pradesh survey)
మీ పేరు సర్వేలో ఉన్నదో లేదో తెలుసుకోవడానికి స్థానిక సచివాలయ సిబ్బందిని సంప్రదించండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి!
Leave a Reply