రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6 లక్షల మందికి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
గొరపాడు గ్రామానికి సంబంధించిన 26 మంది వాలంటీర్ వ్యవస్థ పై వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు మరో మారు వాలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది.
వాలంటీర్ వ్యవస్థ పై హైకోర్టు ఏమని చెప్పిందంటే
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? గతంలో లబ్ధిదారుల బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదే కదా అని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వ ఉద్యోగుల పై నమ్మకం లేకనే వాలంటీర్ల ను పెట్టారా అని హైకోర్టు పేర్కొంది.
సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని అయితే అందుకు ఎంచుకున్న పద్ధతి సరైనది కాదని హైకోర్టు తెలిపింది.
వాలంటీర్ వ్యవస్థ పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, చట్టం అనుమతిస్తే వాలంటీర్ సర్వీసెస్ ను రెగ్యులరైజ్ చేయాలని, వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని పేర్కొంది. అదేవిధంగా వారికి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు హైకోర్టు లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ విచారణను మార్చి 10 కి వాయిదా వేయడం జరిగింది.
Leave a Reply