ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. హిజ్రాల కోసం కొత్తగా ట్రాన్స్ జెండర్ పాలసీని అమల్లోకి తెచ్చింది.
హిజ్రాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను వారికి అందిస్తున్న విషయం తెలిసిందే. వారికి ప్రతి నెల పెన్షన్, ఇల్లు, స్థలాలు , నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటివి అమలు చేస్తుండగా, తాజాగా మరంత మేలు చేసేలా సమగ్రమైన పాలసీ ని ప్రవేశపెట్టింది.
ట్రాన్స్జెండర్ పాలసీ వలన ప్రయోజనాలు ఏంటి?
ట్రాన్స్ సెంటర్లకు సరైన వైద్య విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వారు నివసించే చోట అందరిలా సురక్షితమైన నీటి సరఫరా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. వీటిని మరింత సమర్థవంతంగా ఇకపై అమలు చేయనున్నారు.
మరి ముఖ్యంగా వీరి కోసం గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. అదేవిధంగా వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సాధికారత సాధించేలాగా తోడ్పాటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా నిర్ణయించడం జరిగింది. హిజ్రాల హక్కులను కాపాడి వారి సంక్షేమం మరియు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే వీరి కోసం బడ్జెట్లో రెండు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
Leave a Reply