రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో కొంతమందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దివ్యాంగులు అయి ఉండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రభుత్వం 15000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తుంది. ఇదే విషయానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో అనర్హత ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను తొలగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దివ్యాంగ మరియు ఆరోగ్య కేటగిరి పెన్షన్ పొందుతున్న వారి ఏరివేత
రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి సదరం సర్టిఫికెట్లు జారీచేసి ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ ఇస్తుంది. అయితే 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని ఈ క్యాటగిరిలో ప్రభుత్వం చేర్చడం జరగదు. ఆ విధంగా లబ్ధి పొందుతున్న వారిని ప్రభుత్వం తొలగిస్తుంది.
ఒకవేళ దివ్యాంగులు అయి ఉండి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉన్నవారికి ప్రభుత్వం 15000 పెన్షన్ ఇస్తుంది. ఇందులో ఆరోగ్య సమస్య లేదని తేలితే కేవలం దివ్యంగా పెన్షన్ కింద 6000 మాత్రమే ఇవ్వనుంది.
దివ్యాంగుల పెన్షన్ పొందుతున్న వృద్ధులు ఒకవేళ వారికి వైకల్యం లేదు అని తేలితే వారిని వృద్ధాప్య పెన్షన్ కింద మార్చనుంది. ఈ విధంగా పలుమార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది.
సచివాలయాల ద్వారా నోటీసులు జారీ
గురువారం నుంచి పైన పేర్కొన్న క్యాటగిరిల వారందరికీ కూడా ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుంది. నోటీసులు జారీ చేయడంతో పాటు పెన్షన్ రద్దు ఉత్తర్వులు కూడా వారికి అందించనుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈనెల 25 వరకు ప్రభుత్వం నిర్వహించనుంది.
అర్హత ఉన్నప్పటికీ అనర్హతగా తేలితే అటువంటి వారికి ఆపిల్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
సచివాలయాల ఆధ్వర్యంలో కొత్త సదరం కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన దివ్యాంగులకు ప్రభుత్వం సదరం కొత్త కార్డులు జారీచేస్తుంది. అందులో నిజంగానే అర్హత ఉన్నట్లు తేలితే మరల కొత్త పెన్షన్ కల్పించే అవకాశం ఉంటుంది. పెన్షన్ అనర్హత నోటీసు అందుకున్న వారు మరిన్ని వివరాలకు గ్రామ వార్డు సచివాలయాలలో సంప్రదించవచ్చు.
Leave a Reply