రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక జనఔషధీ మెడికల్ స్టోర్ ను ఓపెన్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ మెడికల్ స్టోర్లలో పనిచేసేందుకు బీసీ యువతకు అవకాశం ఇస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 700 పైగా జన ఔషధి స్టోర్లు (700+ JanAushadhi Stores in AP)
అసలు జన ఔషధీ స్టోర్ లు అంటే ఏమిటి?(What is Janaushadhi store)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్ర PMBJK పథకం కింద దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరలతో కేంద్ర ప్రభుత్వం మెడికల్ షాపులను నిర్వహిస్తుంది. ఇందులో నాణ్యమైన మందులు పేదవారికి అందుబాటులో ఉండే సరసమైన ధరలో అందించడం జరుగుతుంది.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రస్తుతం ప్రతి మండలానికి ఒక జన ఔషధీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే 730 పైగా మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక స్టోర్ ఏర్పాటు చేస్తే, బీసీ యువతకు అందులో ఉపాధి కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. అమరావతిలో నేచరోపతి వర్సిటీ మరియు యోగా పరిషత్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఏపీ జన ఔషధి స్టోర్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి (how to apply for jobs in Jan aushadhi store)
బిసి నిరుద్యోగులు ఇందులో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ త్వరలో ప్రభుత్వం ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌశలం పేరుతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం బీసీ యువతను కూడా ఈ సర్వే ద్వారా గుర్తించ అవకాశం ఉంది.

Leave a Reply