ఏపీలో రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వరకు ఫిజికల్ గా జారీ చేస్తున్నటువంటి డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఆర్సి కార్డులకు శుక్రవారం తో స్వస్తి పలికింది.
ఇక దరఖాస్తు చేసుకునే వారందరికీ డిజిటల్ లైసెన్స్
ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా పేపర్ డ్రైవింగ్ లైసెన్స్ లో పేపర్ ఆర్సి కార్డులు ఉండవు. వాటి స్థానంలో పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు డిజిటల్ ఆర్సి కార్డులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది.
ఏళ్ల తరబడిగా ఒక్కొక్క ఆకు రెండు వందల రూపాయల ఫీజును 35 పోస్టల్ చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తుండగా దీనికి శుక్రవారం నుంచి ముగింపు పలికింది. దీంతో ఇకనుంచి దరఖాస్తు తో పాటు 200 ఫీజ్ మరియు పోస్టల్ చార్జీలను వసూలు చేయరు.
డిజిటల్ కార్డులు ఎలా పనిచేస్తాయి
డిజి లాకర్ లేదా ఎం-పరివాహన్ అనే మొబైల్ అప్లికేషన్స్ లో వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ లు డిజిటల్ ఆర్సి కార్డులో జారి విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుందని వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయమని అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే సరిపోతుందని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎం.కె సిన్హా ప్రకటించారు.
డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కింది పేజ్ లో చెక్ చేయండి
డిజి లోకర్ ఆప్ డౌన్లోడ్ చేసుకునేందుకు కింద బటన్ పై క్లిక్ చేయండి.
Leave a Reply