ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ షాపులో దశలవారీగా గోధుమపిండిని పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు.
తొలిసారి దీనిని చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇక మరోవైపు రాయలసీమలో చిరుధాన్యాలను ప్రోత్సహించేలా రాగులు జొన్నలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.తొలుత కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రాగులను బియ్యానికి బదులుగా పంపిణీ చేస్తున్నారు.
ఆసక్తి ఉన్నవారికి ప్రతి కార్డు ఒక్కింటికి గరిష్టంగా మూడు కిలోల వరకు బియ్యం బదులు రాగులు ఇస్తున్నారు.
అదేవిధంగా గోధుమపిండిని సబ్సిడీపై 16 రూపాయలకే అందిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో గోధుమపిండికి సంబంధించి ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది.
Leave a Reply