ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఆ ప్రాంత ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే నంద్యాల ప్రాంతంలో జొన్నలు పంపిణీ చేస్తుండగా జూన్ నుంచి రాగులను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని మిలైట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది.
ఏ జిల్లాలో రాగులను పంపిణీ చేస్తారు
ముందుగా జూన్ నుంచి కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో రాగులను బియ్యానికి బదులుగా పంపిణీ చేయనున్నారు.
అయితే ఆసక్తిని బట్టి ప్రతి కార్డు ఒక్కింటికి గరిష్టంగా మూడు కిలోల వరకు బియ్యం బదులు రాగులు పొందే అవకాశం ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
జూలై నుంచి మిగిలిన రాయలసీమ జిల్లాలలో కూడా రాగులను పంపిణీ చేస్తామని ప్రకటించారు.
పంపిణీలో ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్
MDU వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేస్తున్న నేపథ్యంలో ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయవచ్చని కమిషనర్ తెలిపారు.
మీ రేషన్ రైస్ కార్డ్ కి సంబంధించి అన్ని లింక్స్ కింది లింక్ ద్వారా పొందవచ్చు
Leave a Reply