ఆగస్ట్ లో భారీగా టిడ్కో ఇళ్ల పంపిణీ, మున్సిపాలిటీల లిస్ట్ విడుదల

ఆగస్ట్ లో భారీగా టిడ్కో ఇళ్ల పంపిణీ, మున్సిపాలిటీల లిస్ట్ విడుదల

ఏపి లోని 8 మున్సిపాలిటీలలో 31,090 టిడ్కో గృహాలను ఆగస్టు నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

8 మున్సిపాలిటీల లిస్ట్ ఇదే

కింద ఇవ్వబడిన ఎనిమిది మున్సిపాలిటీలలో భారీగా వచ్చేనెల రాష్ట్ర ప్రభుత్వం tidco ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • కందుకూరులో – 1,408 ఇళ్లు
  • నెల్లూరులో – 11,000
  • గుంటూరులో – 4,094
  • పుంగనూరులో – 1,536
  • మదనపల్లెలో 1,872,
  • ఆళ్లగడ్డలో 1,392
  • డోన్ లో 288
  • విశాఖలో 9,500 టిడ్కో ఇళ్లు

మంగళవారం విజయవాడలోని టిడ్కో కార్యాలయంలో టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ చిత్తూరి శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశంలో ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన 72 వేల గృహ లబ్ధిదారులకు, ఆయా సముదాయాల నిర్వహణకు వివిధ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలను రూపొందించి ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని నిర్ణయించినట్టు చైర్మన్ తెలిపారు.

టిడ్కో ఇళ్లకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

You cannot copy content of this page