ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను సందర్శించాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏకంగా 175 ప్రముఖ ఆలయాల్లోని సేవలను ముందస్తు బుక్ చేసుకునే సదుపాయం కల్పించిన దేవాదాయ శాఖ.. కొత్త వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఏపీలో 16 ప్రముఖ దేవాలయాలలో దర్శనం, సేవా, అర్చన, వసతి తదితర టికెట్లను 15 నుంచి నెల రోజులు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుని సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
మొదటి దశలో 175 ఆలయంలో ఈ సేవలను విస్తరించి రెండో దశలో ఓ మోస్తరు ఆలయాల్లో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవాదాయ శాఖ వెల్లడించింది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న దేవాలయాల లిస్ట్ ఇదే
సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల,విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు,శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది,విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది,
అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి
సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివి ముందస్తుగానే ఆన్లైన్లో బుక్ చేసేందుకు అందుబాటులోకి ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా
నిర్ణయించడం జరిగింది.
ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి?
అడ్వాన్స్ బుకింగ్ చేసేందుకు భక్తులు కింది లింక్ లోకి వెళ్లి online booking పైన క్లిక్ చేయాలి
Booking paina క్లిక్ చేయగానే మిమ్మల్ని లాగిన్ చేయమని అడుగుతుంది. మొదటి సారి చేస్తున్న వారు Sign up ఆప్షన్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
Leave a Reply