ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు వెల్లడించింది. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు చేయనున్నారు అనేదానిపైన ఇప్పటికే ప్రజల్లో చాలా చర్చ నడుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
మంత్రి మండలి నిర్ణయాల మేరకు ఏ పథకాలు ఎప్పుడు అమలు చేయనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ 6 సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ఇదే..
సూపర్ సిక్స్ పథకంలో కీలకమైనటువంటి తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వచ్చే విద్యా సంవత్సరం లోపు ప్రారంభించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఇక రైతులకు అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయం రైతు భరోసా పథకాన్ని అన్నదాత పథకం కింద పీఎం కిసాన్ తదుపరి విడతతో పాటు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు 20 వేల రూపాయల భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మహిళలకు ఉచిత బస్సు మరియు నలుగు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ప్రారంభించనుంది.
- అన్నదాత పథకం – రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన 20వేల రూపాయల ఆర్థిక సహాయం హమిని వచ్చే పిఎం కిసాన్ విడతతో పాటు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్నదాత సుఖీభవ పేరు మీద ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది. పీఎం కిసాన్ 6000 నుంచి కేంద్ర ప్రభుత్వం 10000 పెంచుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 జోడించి 20వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనుంది.
అన్నదాత సుఖీభవ [Annadata Sukhibhava launch date] – February or March 2025
- తల్లికి వందనం – చదువుకునే ప్రతి పాఠశాల విద్యార్థికి 15000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండే అంత మందికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించనున్న ప్రభుత్వం. ఈ పథకాన్ని జూన్ 2025 లోపు ప్రభుత్వం ప్రారంభిస్తుంది.
తల్లికి వందనం [Talliki Vandanam launch date] : June 2025
- మత్స్యకారులకు 20 వేలు – ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు 20వేల రూపాయలను అందించనున్నట్లు మంత్రిమండలి నిర్ణయించింది. ఇటీవల వీరికి గత ప్రభుత్వం అందించినటువంటి ఆర్థిక సహాయాన్ని 20వేలకు పెంచిన విషయం తెలిసిందే.
మత్స్యకార భరోసా [ Matsyakara Bharosa launch date] April 2025
- విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ – విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ను దశలవారీగా నేరుగా కళాశాలల ఖాతాలోకి జమ చేయనన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
- ఇక మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు మరియు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను అన్నదాత మరియు తల్లికి వందనం పథకాల అనంతరం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Leave a Reply