ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.పాఠశాలలు జూన్ 12 నుంచి యధావిధిగా ప్రారంభం అవుతున్నప్పటికీ జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మరో వారం పొడిగిస్తూ జూన్ 24 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఎండలు తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినతులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జూన్ 24 వరకు టైమింగ్స్ ఇవే
జూన్ 12 నుంచి 24 వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత నుంచి యధావిధి సమయాల్లో తరగతులు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
రాగి జావ మరియు మిడ్ డే మీల్స్ టైమింగ్ ఇదే
ఇక రాగిజావను ఉ. 8.30 నుంచి 9 మధ్యలో అందిస్తారు.
ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని 11.30 నుంచి 12 మధ్యలో అమలు చేస్తారు.
ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఉత్తర్వులను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
ఇక రేపే జగనన్న విద్యా కానుక ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా కోసం నుంచి ఈ ఏడాది విద్యా కానుక పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది.
Leave a Reply