AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

AP SC Corporation Loans – How to Apply For AP SC Corporation loans 2025 Online Process

AP SC Corporation Loans: ఎస్సీల స్వయం ఉపాధి కల్ప నకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవా, రవాణా, వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ పథకానికి ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు దర ఖాస్తులు స్వీకరించనుంది. రూ. 3 లక్షలు మొదలు రూ. 10 లక్షలకుపైబడి వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహ కారం అందిస్తామని సాంఘిక సంక్షేమశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా Online Registrations జరుగుతాయి. మెడికల్ షాపులు, ల్యాబ్, ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, ఎలక్ట్రిక్ ఆటో, కార్లు, గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

AP SC Corporation Loans Apply చేసుకోవాటికి ఎవరికి వారు సొంతంగా AP OBMMS Site లో లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీయొక్క Grama Ward Sachivalayams నందు  AP Corporation Loans కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు . 

ఎస్సీల స్వయం ఉపాధి పథకానికి మార్గదర్శకాలు

  • ప్రతి యూనిట్ ఏర్పాటుకు లబ్ధి దారుడు 5% వాటాగా చెల్లించాలి.
  • యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 50% నుంచి 60% వరకు రాయితీ ఇస్తుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించనుంది. రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతే అందించనుంది.
  • యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత ఆరు నెలలకోసారి జియో ట్యాగింగ్ తప్పనిసరి. ఆ తర్వాత మరో రెండు విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు ఉంటాయి.
  • వీటన్నింటితోపాటు యూనిట్ ప్రారంభించిన రెండేళ్లు బ్యాంకు రుణ వాయిదాలు సక్రమం చెల్లిస్తేనే లబ్ధిదారుడికి రాయితీని అందించనుంది. అప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుడి పేరు మీద ప్రత్యేక ఖాతాలో (టర్మ్ డిపాజిట్ రిసిప్ట్)జమ చేస్తుంది.

రాయితీ రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం
అందించనుంది. సరకు రవాణా ట్రక్కుల కొనుగోలుకూ ఆర్థిక చేయూత ఇవ్వనుంది. 6,240 వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగో లుకూ సహకారం అందించనుంది. ఎస్సీ రైతుల బృందా లకు డ్రోన్లను అందిస్తుంది. సర్వీస్ సెక్టార్లో 10,500 మందికి చేయూత అందించనున్నారు.

కావలసిన డాకుమెంట్స్

  • క్యాస్ట్ సర్టిఫికేట్ 
  • రేషన్ కార్డు 
  • ఆధార్ కార్డు (NPCI సర్వర్ తో అనగా బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిన) మొబైల్ నెంబర్ ని లింక్ చేయించుకోండి.
  • గతంలో ట్రైనింగు లేదా శిక్షణ పొందు ఉంటే ఆ సర్టిఫికెట్ 
  • వాహన రంగ వ్యాపారానికి లేదా పనిని ప్రారంభించడానికి డ్రైవింగ్ లైసెన్సు 
  • మొబైల్ నెంబరు 
  • ఫార్మసీ సెక్టార్ కి సంబంధించి బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ సర్టిఫికెట్
  • మీ ఆధార్ కార్డుకు పని చేసే

గమనిక: కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చేయించుకునేటప్పుడు మీ ఆధార్ కార్డుతో లింక్ అయినా మరియు వాట్సప్ కలిగిన ఫోన్ నెంబర్ ని ఇవ్వండి. దీని ద్వారా కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు మీకు మరల అవసరమైనప్పుడు (6 నెలల తర్వాత) వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 5 నిమిషాల్లో పొందవచ్చు.

AP SC Corporation Loan Amount Details 2025 

ఎస్సీ కార్పొరేషన్ కింద అందించే మొత్తం రుణాల స్లాబుల వివరాలు త్వరలో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది

Eligibility Criteria for AP SC Corporation Loans 2025

Who Can Apply for AP Corporation Loans?

కింద తెలిపిన అర్హతలు ఉంటే సులువుగా AP Corporation Loans  ని అందుకోవచ్చు

  1. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి
  2. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి
  3. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
  4. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి
  5. ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
  6. మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి
  7. చదువుతో సంబంధం లేదు. చదివితే పాస్ సర్టిఫికెట్ ఉంటె పెట్టవచ్చు , లేక పోతే లేదు .
  8. ట్రైనింగు / పథకము / సబ్సిడీ పొందు ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి
  9. మెడికల్ షాప్ కు పెట్టాలనుకుంటే డి ఫార్మసీ / బి ఫార్మసీ /ఎం ఫార్మసీలో ఏదైనా ఉండాలి

Note: దరఖాస్తు విధానం మరియు క్యాటగిరీ వివరాలు త్వరలో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

<p>You cannot copy content of this page</p>