నవంబర్ 14 నుంచి SADAREM Slot Booking 2025 ప్రారంభం | సదరం స్లాట్ బుకింగ్ పూర్తి వివరాలు

నవంబర్ 14 నుంచి SADAREM Slot Booking 2025 ప్రారంభం | సదరం స్లాట్ బుకింగ్ పూర్తి వివరాలు

AP Sadarem Certificate 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల ఫైకల్స్ నిర్ధారణ కోసం SADAREM Slot Booking 2025 (సదరం స్లాట్ బుకింగ్) ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ నెల నవంబర్ 14, 2025 నుండి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ చక్రధర్ తెలిపారు.

దివ్యాంగులందరూ sadarem.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా తమ SADAREM slot booking చేసుకోవచ్చు.


Table of Contents

SADAREM Slot Booking 2025 వివరాలు

వివరాలుసమాచారం
ప్రారంభ తేదీనవంబర్ 14, 2025
పోర్టల్https://sadarem.ap.gov.in
అధికార సంస్థAndhra Pradesh Health, Medical & Family Welfare Dept
అర్హతదివ్యాంగులు / Divyangulu
బుకింగ్ స్థలాలుMeeSeva, సచివాలయాలు, లేదా ఆన్లైన్ SADAREM Portal

SADAREM Slot Booking 2025 – ముఖ్యమైన లింకులు

🔗 లింక్ / Linkవివరణ / Description
Sadarem Slot Booking Application Form – సదరం స్లాట్ బుకింగ్ అప్లికేషన్ ఫారం Newసదరం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకునే అధికారిక అప్లికేషన్ పీడీఎఫ్ ఫారం
Sadarem Slot Booking Application Status – సదరం స్లాట్ బుకింగ్ అప్లికేషన్ స్టేటస్ Newమీ సదరం దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి ఈ లింక్ ఉపయోగించండి
District Wise Sadarem Slots Available List (July, AUG, SEP – 2024) Newజిల్లాలవారీగా అందుబాటులో ఉన్న సదరం స్లాట్ల జాబితా (2024)
Sadarem Slot Status Checking Newమీ సదరం అప్లికేషన్ లేదా స్లాట్ స్టేటస్‌ను ఆన్లైన్‌లో చెక్ చేయండి
Sadarem Slot Booking అప్లికేషన్ (Request Form) NewSadarem సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ రిక్వెస్ట్ ఫారం (User Manual)
Sadarem Dashboard Linkరాష్ట్రవ్యాప్తంగా ఉన్న సదరం డేటా, అప్రూవల్ మరియు బోర్డ్ వివరాలు
దివ్యాంగులకు సదరం అప్లికేషన్ (Telugu PDF)సదరం అప్లికేషన్ తెలుగులో – దివ్యాంగులకు గైడ్
Sadarem Online Slot Booking ఎలా చేయాలి (Video) NewSadarem Slot Booking Video Demo (YouTube)

SADAREM అంటే ఏమిటి?

SADAREM (Software for Assessment of Disabled for Access, Rehabilitation & Empowerment) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రాజెక్ట్.
AP SADAREM 2025 వ్యవస్థ ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగుల శారీరక లేదా మానసిక అంగవైకల్యాలను శాస్త్రీయంగా అంచనా వేసి Disability Certificate (సదరం సర్టిఫికేట్) జారీ చేస్తుంది.

SADAREM certificate ద్వారా ప్రభుత్వం అందించే దివ్యాంగుల పెన్షన్, స్కాలర్‌షిప్‌లు, ఉచిత ట్రావెల్ పాస్‌లు మరియు ఇతర పథకాలు పొందవచ్చు.

AP Sadarem Certificate ద్వారా లభించే ప్రయోజనాలు

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత
  • వికలాంగ పెన్షన్ పొందే అవకాశం
  • APSRTC బస్సుల్లో రాయితీ లేదా ఉచిత ప్రయాణం
  • ఆరోగ్యశ్రీ & వైద్య బీమా సదుపాయం
  • స్కాలర్‌షిప్‌లు & ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాలు
  • స్వయం ఉపాధి రుణాలు & బ్యాంకు మద్దతు పథకాలు
  • వీల్‌చైర్స్, హియరింగ్ ఎయిడ్స్ వంటి సహాయ పరికరాలు

👩‍🦽 AP Sadarem Certificate అర్హతలు

  • 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత కలిగిన వారు
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులు మాత్రమే
  • ప్రభుత్వ మెడికల్ బోర్డ్ పరీక్షలో అర్హత పొందిన వారు
  • 5 ఏళ్లు పైబడిన పిల్లలు, యువత, పెద్దలు అందరూ అర్హులు

🧾 SADAREM Slot Booking కోసం అవసరమైన పత్రాలు

  • ఆధార్ కార్డు (Aadhaar Card)
  • చిరునామా రుజువు (రేషన్ కార్డు / ఓటర్ ఐడి / బ్యాంక్ పాస్‌బుక్)
  • Sadarem అప్లికేషన్ ఫారం
  • వైద్య నివేదికలు (ఉంటే)
  • వికలాంగ ఫోటో (Disability Photo)
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ (OTP కోసం)

అప్లికేషన్ ఫీజు: ₹40/- (MeeSeva సెంటర్‌లో చెల్లించాలి)

📊 Sadarem Slot Booking Status ఎలా చెక్ చేయాలి?

  1. Sadarem Status Link ఓపెన్ చేయండి.
  2. 17 అంకెల Sadarem ID మరియు Captcha నమోదు చేయండి.
  3. Search పై క్లిక్ చేయండి.
  4. తేదీ, సమయం మరియు హాస్పిటల్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. WL (Waiting List) అని వస్తే, కొత్త స్లాట్లు విడుదలయ్యే వరకు వేచి ఉండండి.

How to Apply for AP Sadarem Disability Certificate Online? 

AP Sadarem 2025 Slot Booking – Step by Step Guide

క్రింద పేర్కొన్న విధంగా మీరు మీ Sadarem Certificate Slot Booking చేసుకోవచ్చు.

Step 1 : AP Seva Portal Login

ముందుగా కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి, మీ DA/WEDPS Login ID మరియు Password తో లాగిన్ అవ్వండి.

SADAREM SLOT BOOKING LINK

Step 2 : Other Services ఎంపిక చేయండి

లాగిన్ అయిన తర్వాత “Other Services” పై క్లిక్ చేయండి. ఇది మిమ్మల్ని పాత GSWS Portal (Grama/Ward Sachivalayam site) కి రీడైరెక్ట్ చేస్తుంది.

Step 3 : Health Department ఎంపిక

తర్వాత “Health, Medical & Family Welfare” విభాగంలోకి వెళ్లి “Family Welfare” పై క్లిక్ చేయండి.

Step 4 : Slot Booking for Sadarem Certificate

ఇప్పుడు “Slot Booking for Sadarem Certificate” అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : లబ్ధిదారుని వివరాలు నమోదు చేయండి

  • Beneficiary Name
  • Beneficiary Mobile Number
  • Beneficiary Aadhaar Number

ఈ వివరాలు ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయండి.

Step 6 : Aadhaar OTP Verification

Aadhaar Number ఎంటర్ చేసిన తర్వాత Declaration టిక్ చేసి “Generate OTP” పై క్లిక్ చేయండి.

గమనిక: OTP క్లిక్ చేసిన వెంటనే Sadarem ID వస్తే, మీరు ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నారని అర్థం. ఒకసారి జారీ అయిన ID, డిలీట్ అయ్యే వరకు కొత్తది పొందడం సాధ్యం కాదు.

Step 7 : OTP ను వెరిఫై చేయండి

Aadhaar‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చిన 6 అంకెల OTP ను ఎంటర్ చేసి “Validate OTP” పై క్లిక్ చేయండి.

Step 8 : Hospitals Slots లిస్ట్

ఇప్పుడు Hospitals వారీగా Slots లిస్ట్ వస్తుంది. మీకు కావలసిన Category అందుబాటులో ఉంటే “Submit” పై క్లిక్ చేయండి.

Step 9 : Beneficiary Details Display

Aadhaar ఆధారంగా లబ్ధిదారుని పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

Step 10 : పేరు తెలుగులో టైప్ చేయండి

“కార్డు మీద చూపవలసిన పేరు” వద్ద మీ పేరు తెలుగులో టైప్ చేయండి. మీరు కావాలనుకుంటే ఇతర వివరాలు కూడా నింపవచ్చు.

Step 11 : వివాహ స్థితి (Marital Status)

“Marital Status” వద్ద Married / Unmarried / Widow / Widower / Divorced అనే ఎంపికను ఎంచుకోండి.

Step 12 : పుట్టు మచ్చలు నమోదు చేయండి

“Identification Marks” వద్ద మీకు ఉన్న రెండు పుట్టు మచ్చలు నమోదు చేయండి.

Step 13 : తండ్రి లేదా సంరక్షకుడి పేరు నమోదు చేయండి

“తండ్రి / సంరక్షకుడి పేరు” అనే చోట పేరు తెలుగులో టైప్ చేయండి.

Step 14 : చిరునామా వివరాలు

మీ Mandal, Panchayat, Village / Town, Habitation / Ward No, Phone Number వివరాలు నమోదు చేయండి.

Step 15 : Hospital ఎంపిక

“Hospital Details” వద్ద మీ జిల్లా మరియు ఆసుపత్రి ఎంపిక చేసుకోండి.

Step 16 : Type of Disability

“Type of Disability” వద్ద మీరు ఏ రకం చెకప్ చేయించుకోవాలనుకుంటున్నారో (ఉదా: Hearing, Vision, Mental, Physical) అదాన్ని ఎంచుకుని Submit పై క్లిక్ చేయండి.

గమనిక: మీరు ఎంచుకున్న ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సేవలే ఆప్షన్‌లుగా కనిపిస్తాయి.

Step 17 : Submit చేసి Acknowledgment డౌన్‌లోడ్ చేయండి

Submit చేసిన తర్వాత మీ ప్రాథమిక వివరాలు కన్ఫర్మ్ చేసే ఒక Popup వస్తుంది. “OK” చేస్తే కొత్త Sadarem ID జనరేట్ అవుతుంది.

దాని కింద ఉన్న “Acknowledgment Download” పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి.

గమనిక: Acknowledgment లో మీరు వెళ్లాల్సిన ఆసుపత్రి పేరు, తేదీ మరియు సమయం కనిపిస్తుంది. Waiting List (WL) లో ఉన్నవారికి తరువాత Slot కన్‌ఫర్మ్ అయినప్పుడు SMS ద్వారా సమాచారం వస్తుంది.


☎️ AP Sadarem హెల్ప్‌లైన్ & సపోర్ట్

  • 📞 సాధారణ హెల్ప్‌లైన్: 1902
  • 📞 వైద్య సంబంధిత సమస్యల కోసం: 1907
  • 📧 ఇమెయిల్: sadarem.helpdesk@aptonline.in
  • 🏢 చిరునామా: డి.నెం.74-14-2, 1వ అంతస్తు, రాజా నరేంద్ర బిల్డింగ్, కృష్ణ నగర్, విజయవాడ – 520007

💬 సాధారణ సమస్యలు & పరిష్కారాలు

  • ❌ స్లాట్ అందుబాటులో లేకపోతే → “Check Slot Availability” ఎంపికలో జిల్లా వారీగా చెక్ చేయండి.
  • ❌ OTP రాకపోతే → ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ సరిచూడండి.
  • ❌ స్టేటస్ కనిపించకపోతే → “Check Status” లింక్‌లో Sadarem ID తో చెక్ చేయండి.

🔖 ముగింపు

AP Sadarem Certificate Slot Booking 2025 వికలాంగులకు ఒక ముఖ్యమైన ప్రభుత్వ సేవ. ఏప్రిల్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ద్వారా దివ్యాంగులు సులభంగా తమ సర్టిఫికేట్ పొందవచ్చు. మీ ఆధార్, చిరునామా పత్రాలు సిద్ధంగా ఉంచి, దగ్గరలోని సచివాలయం లేదా MeeSeva కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోండి.



💬 SADAREM Certificate Benefits (ప్రయోజనాలు)

దివ్యాంగుల పెన్షన్ పథకం
ఉచిత RTC / రైల్వే ట్రావెల్ పాస్‌లు
విద్యా స్కాలర్‌షిప్‌లు
ఉద్యోగ రిజర్వేషన్లు (PWD Quota)
ఆరోగ్య బీమా మరియు వైద్య సేవలు


🔎 FAQs – SADAREM Slot Booking 2025

Q1. సదరం స్లాట్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
👉 నవంబర్ 14, 2025 నుండి SADAREM Slot Booking 2025 ప్రారంభమవుతుంది.

Q2. sadarem.ap.gov.in వెబ్‌సైట్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
👉 పోర్టల్‌లో “Request for SADAREM Certificate” ఎంపికపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

Q3. పాత సర్టిఫికేట్ ఉన్నవారికి కూడా బుకింగ్ అవసరమా?
👉 అవును, SADAREM renewal కోసం స్లాట్ బుక్ చేయాలి.

Q4. MeeSeva ద్వారా బుకింగ్ చేయవచ్చా?
👉 అవును, MeeSeva కేంద్రాల్లో కూడా AP SADAREM 2025 Slot Booking చేయవచ్చు.


You cannot copy content of this page