ఏపి లో ప్రతి ఇంటికి MDU వాహనాల ద్వారా రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తున్న వాహనదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
MDU వాహనాలకు వాహన మిత్ర
వాహన దారులు ప్రతి ఏటా చెల్లించే భీమా ప్రీమియం అమౌంట్ ను ఇక పై ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆటో, క్యాబ్, మ్యక్సి క్యాబ్ డ్రైవర్లకు అందిస్తున్న వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని వీరికి వర్తింప చేయనున్నట్లు ప్రకటించింది.
బ్యాంకులు తమ వేతనం నుంచి ప్రీమియం అమౌంట్ ను కట్ చేస్తున్నాయి అని పలువురు ఆపరేటర్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కు విన్నవించగా ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు.
సానుకూలంగా స్పందించి న ముఖ్యమంత్రి వీరికి కుడా వాహన మిత్ర ఇవ్వాలని ఆదేశించారు
ఎప్పటి నుంచి అమలు ఏ నెల లో ఇస్తారు?
MDU వాహనాలకు 2021 నుంచే ఈ ప్రీమియం ను రాష్ట్ర ప్రభుత్వం భరించ నున్నట్లు తెలిపింది. ఈ మేరకు జూలై 2023 లో వాహన మిత్ర పథకం లబ్ది దారులతో పాటు వీరికి కూడా అమౌంట్ విడుదల చేయనుంది.
ఈ మేరకు ప్రభుత్వం పై 9 కోట్ల అదనపు భారం పడనునట్లు ప్రభుత్వం తెలిపింది.
Leave a Reply