రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్..వినియోగదారుల సాధికారితే లక్ష్యంగా పౌర సరఫరాలశాఖ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 1967 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది.
గతంలో వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఒకే దేశం ఒకే రేషన్, రాష్ట్ర ఫుడ్ కమీషన్ మరియు ధాన్యం సేకరణలకు సంబధించి వేర్వేరు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉండేవి, ఇప్పుడు వాటన్నింటినీ అనుసంధానం చేసి అన్ని సేవలకు ఫిర్యాదులు ఒకే నెంబరులో అందుబాటులో ఉండే విధంగా సమగ్ర పరిష్కార విధానంలో 1967 ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబరు ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ 1967 నెంబరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి శాఖాపరంగా ఉన్న అన్ని మార్గాలను పౌర సరఫరాల శాఖ వినియోగిస్తోంది. రేషన్ డెలివరీ వాహనాలపై ఇప్పటికే ఈ నెంబరును ప్రజలందరికీ తెలిసే విధంగా ముద్రించారు.
అదేవిధంగా ఆడియో మెసేజ్ ద్వారా కూడా ఈ టోల్ ఫ్రీ 1967 నెంబరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతున్నారు. ప్రతి మండలంలో మండల వినియోగదారుల సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు డిప్యూటీ తాహశీల్దార్లను ఇంచార్జిలుగా నియమించారు. వినియోగదారుల రక్షణ చట్టంనకు సంబంధించి తమ సమస్యల పరిష్కారాల కొరకు వినియోగదారులు వీటిని వినియోగించుకొనే అవకాశం కల్పించారు.
AP Ration Card Customer Care number [Integrated Toll Free] : 1967
వినియోగదారులు వేటి పై ఫిర్యాదు చేయవచ్చంటే.. [
• ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించి షాప్ ద్వారా నిత్యావసర సరుకుల సరఫరా చేయం”పోవడం, నిత్యావసర సరుకుల నాణ్యతలోపాలు, తక్కువ తూకంతో నిత్యావసర
సరుకుల పంపిణీ చేయడం, డోర్ డెలివరీ చేయకపోవడం, షాప్ డీలర్ పై ఫిర్యాదులు, రశీదు ఇవ్వక పోవడం తదితర ఫిర్యాదులు.
• బియ్యం కార్డుకు సంబంధించి కొత్త కార్డులు, సిట్ కార్డులు, బియ్యం కార్డ్ సేవల అప్లికేషన్ స్థితి, ఒకే దేశం ఒకే రేషన్
• గ్యాస్ సిలిండర్కు సంబంధించి డోర్ డెలివరీ చేయకపోవడం, విచారణ, డోర్ డెలివరీకి అదనముగా రుసుము వసూలు చేయడం. కొత్త కనెక్షన్ కొరకు అదనపు
డబ్బులు వసూలు చేయడం, రశీదు ఇవ్వక పోవడం తదితర ఫిర్యాదులు. తూనికలు కొలతల శాఖకు సంబంధించి సరుకుల నాణ్యత లోపాలు, సరుకులు తూకం
నందువ్యత్యాసాలు, ధర కన్న ఎక్కువ వసూలు చేయడం తదితర ఫిర్యాదులు.
• పెట్రోల్ బంకులకు సంబంధించి పెట్రోల్, డీజిల్ నాణ్యత లోపాలు, పెట్రోల్, డీజిల్ తూకం నందు వ్యత్యాసాలు తదితర ఫిర్యాదులు. పెట్రోల్ బంకులందు సౌకర్యాలు (గాలి
నీరు త్రాగు నీరు టాయిలెట్స్) కల్పించక పోవడం.
• ధాన్యం సేకరణకు సంబంధించి ధాన్యం సేకరణలో జాప్యం, ధాన్యం తూకం నందు వత్యాసాలు, ధాన్యం సేకరణ నందు రైతుల నుండి మిల్లర్లు గాని మధ్యవర్తులు గాని
డబ్బులు డిమాండ్ చేయడం, సకాలంలో ధాన్యమును మిల్లుకు తరలించకపోవడం, ధాన్యమును మిల్లులు స్వీకరించకపోవడం, మద్దతు ధర చెల్లించకపోవడం, హమాలి
మరియు రవాణా చార్జీలు చెలించక పోవడం తదితర ఫిర్యాదులు చేయొచ్చు. వీటితో పాటు సమాచారం పొందవచ్చు. మెరుగైన సేవల కోసం2
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికే 1967 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.
1967 కాల్ సెంటర్ నెంబరకు అందిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.
Leave a Reply