ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే..
గతంలో పెన్షన్ పంపిణీకి సంబంధించి ఒక నెల మిస్సయినా మరొక నెలలో ఆ పెన్షన్ అమౌంట్ ను అందించేవారు. అయితే ఆ వెసులుబాటు ను ఎత్తివేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పెన్షన్ పంపిణీ సంబంధించి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై జియో ఫెన్సింగ్ విధానంతో ఏ ఊర్లో పెన్షన్ ఆ ఊర్లోనే
ఇకపై గ్రామ వార్డు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు పెన్షన్ పేమెంట్ జరగాలంటే వారు తమ సచివాలయం నుంచి 15 కిలోమీటర్ల లోపల పరిధిలో ఉంటేనే వాళ్లు పెన్షన్ పంపిణీ చేయగలరు.
తమ పరిధిలో ఎవరైనా ఇల్లు మారినా లేదా దూరం మారినా, 15 కిలోమీటర్ల పరిధిలో దాటితే సంబంధిత జిల్లా డిఆర్డిఏ అధికారుల వాలంటీర్లు సంప్రదించాల్సి ఉంటుంది.
ఈ మేరకు సంబంధిత పెన్షన్ కానుక అప్లికేషన్ లో ప్రభుత్వం Geo fencing విధానాన్ని ప్రవేశ పెట్టింది.
అయితే ఈ విధానం పై మీడియా లో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆప్షన్ ను తాత్కాలికంగా నిలిపే వేసే అవకాశం ఉంది.
వైయస్సార్ పెన్షన్ కానుక సంబంధించి లేటెస్ట్ యాప్ మరియు లింక్స్ కింది లింక్ ద్వారా పొందవచ్చు.
Leave a Reply