ఏపి లో ప్రతి నెల 1 వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ సారి ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 03 నుంచి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే ఏప్రిల్ 03 న కూడా ఎప్పటిలా తెల్లవారు జామునే పంపిణీ చేయడం కుదరదు. మూడో తేదీ మధ్యాహ్నం లేదా మరుసటి రోజు అనగా ఏప్రిల్ 04 నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సచివాలయాల బ్యాంక్ ఖాతాలకు ఏప్రిల్ 3 న అమౌంట్ జమ చేస్తారు. ఆ తర్వాత వాటిని అదే రోజు డ్రా చేసి పంపిణీ చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున 03 వ తేదీ మధ్యాహ్నం నుంచి ఏప్రిల్ 7 వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
ఏప్రిల్ 1 న వార్షిక లెక్కల నేపథ్యంలో బ్యాంకులకు సెలవు, ఏప్రిల్ 2 న ఆదివారం కావడంతో CFMS నుంచి సచివాలయాల కు ఏప్రిల్ మూడో తేదీనే డబ్బులు జమ కానున్నాయని తెలిపింది.
పెన్షన్ పంపిణీ సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన పూర్తి వివరాలు మరియు సూచనలు కింద ఇవ్వబడ్డాయి. చెక్ చేయండి.
పూర్తి సర్క్యులర్ డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply