ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రబి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈనెల 21 వరకు ఎకరాకు 79 బస్తాలు మాత్రమే గరిష్టంగా కొనుగోలు చేస్తుండగా తాజా నిర్ణయంతో ఎకరాకు గరిష్టంగా 95 బస్తాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మీడియాకు వెల్లడించారు.
ఈమెరకు రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విత్తడం దగ్గర నుంచి క్రయవిక్రయాల వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.
రైతుల విజ్ఞప్తి మేరకే గరిష్ట పరిమితిని పెంచినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ గరిష్ట పరిమితి ఏప్రిల్ 23 నుంచి జరిపే కొనుగోళ్లకు వర్తిస్తుందని తెలిపారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధర తగ్గకుండా దాన్యం సేకరణ చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఆన్లైన్ విధానంలో కూడా ఈ క్రయ విక్రయాలు జరుపుతున్నట్లు తద్వారా మరింత పారదర్శకత తీసుకొస్తున్నట్లు వివరించారు.
రబీ సీజన్ కి సంబంధించి కేంద్రం నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర MSP ధరలు కింది లింక్ లో చెక్ చేయవచ్చు.
Leave a Reply