రైతులకు గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే ధాన్యం సేకరణ అమౌంట్

రైతులకు గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే ధాన్యం సేకరణ అమౌంట్

ఏపీలో అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా రబి పంటకు సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిన మూడు వారాల తర్వాతే రైతుల ఖాతాలో అమౌంట్ పడుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అకాల వర్షాల కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ అమౌంటును ఐదు రోజుల్లోనే జమ చేస్తుంది. ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది.

మే 10 న ఒక్కరోజే 474 కోట్లు జమ

రాష్ట్రవ్యాప్తంగా 32558 మంది రైతుల ఖాతాలో మే 10 న ఒక్క రోజే ప్రభుత్వ 474 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేసింది.

దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రబి సీజన్ కి సంబంధించి ఇప్పటివరకు 1277 కోట్ల రూపాయలను ఇప్పటివరకు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 83% మంది రైతుల ఖాతాలో ధాన్య సేకరణ నిధులు జమ చేసినట్లు వ్యవసాయ అధికారులు ప్రకటించారు. మరి కొంతమందికి సాంకేతిక కారణాలు మరియు ఇతర కారణాల వలన కొంత ఆలస్యం అవుతున్నట్లు వారికి కూడా వీలైనంత త్వరలో అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రకటించారు.

Click here to Share

You cannot copy content of this page