రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని.. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు గడువు ఉంటుందని మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలక ప్రకటన చేశారు. మే 7 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఇక ఈ కేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 95 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా 1.50 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉందని అంచనా.
క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు
మరోవైపు క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది. 4.24 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యులు పేర్లు అన్ని కనిపించేలా ముద్రిస్తారు. అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇక ఈ కేవైసీ పూర్తి అయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
GSWS ప్లాట్‌ఫామ్ ద్వారా 7 రైస్ కార్డు సేవల పునః ప్రారంభం
07-05-2025 నుండి క్రింద పేర్కొన్న ఏడు (7) రైస్ కార్డు సంబంధిత సేవలు GSWS ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించబడుతున్నట్లు తెలియజేయడమైనది:
- కొత్త రైస్ కార్డ్
- రైస్ కార్డుకు సభ్యుని చేరిక
- రైస్ కార్డ్ విభజన
- రైస్ కార్డులో నుండి సభ్యుని తొలగింపు
- రైస్ కార్డ్ సమర్పణ
- రైస్ కార్డులో చిరునామా మార్పు
- రైస్ కార్డులో తప్పుగా పొందిన ఆధార్ లింకేజీ సవరణ
ఈ సేవలు మునుపటిగా ఆమోదించబడిన ప్రామాణిక కార్యాచరణ విధానాల (SOPs) ప్రకారం మరియు ఇతర శాఖల డేటాబేస్‌లతో కలిపిన దృఢమైన ధృవీకరణల ఆధారంగా నిర్వహించబడతాయి.
GSWS మరియు మండల స్థాయి యంత్రాంగం ఈ సేవలను రేపటి నుండి సమర్థవంతంగా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరడమైనది. ఇప్పటివరకు స్వీకరించబడిన అన్ని దరఖాస్తులు కూడా GSWS AP సేవా ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాసెస్ చేయబడతాయి.
Rice Card [ Ration Card ] Application Forms :
రైస్ కార్డు [ రేషన్ కార్డు] లొ 7 రకముల సేవలకు దరఖాస్తుకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన దరఖాస్తు ఫారంలను అన్ని ఒకే చోట ఉంచడం జరిగింది. నేరుగా ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Ration Card / Rice Card: Splitting Application Form | Click |
Ration Card / Rice Card: Member Addition Application Form | Click |
Ration Card / Rice Card: Surrender Application Form | Click |
Ration Card / Rice Card: New Card Application Form | Click |
Ration Card / Rice Card: Surrender Application Form | Click |
Ration Card / Rice Card: Address Change Application Form | Click |
Ration Card / Rice Card: Wrong Aadhaar Correction Application Form | Click |
రైస్ కార్డు పొందుటకు అర్హతలు :
1.కొత్త బియ్యం కార్డు :
బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడు అయ్యి ప్రజసాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మాపింగ్ లో తప్పనిసరిగా ఉండవలెను.
ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయ్యి వుంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయ్యి ఉండాలి.
ముఖ్య గమనిక :
ఇప్పటి వరకు ఎవరికీ అయితే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ గారి బియ్యం కార్డు లో కానీ అత్త గారి కార్డు లో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడును.
బియ్యం కార్డు లో వ్యక్తులను జోడించడం :
చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, పెళ్లి అయిన వధువు ని జోడించుటకు వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు లో వారి యొక్క భర్త పేరు వున్నచో దానిని పరిగణలోకి తీసుకోవడం జరుగును
ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానిది అయ్యి ఉండవలెను.
బియ్యం కార్డు విభజన :
బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజాసాధికార సర్వే లో సెపరేట్ గా ఉండవలెను. లేనిచో విభజించుట కుదరదు.
బియ్యం కార్డు లో వ్యక్తిని తొలగించుట :
చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగును. అలా కాకుండా చాలా మంది మా అబ్బాయి అమెరికా లో వున్నాడు తను సంపాదించేది మాకు పెడతాడా కార్డు లో నుంచి తీసేయండి ప్రజాసాధికార సర్వే లో నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు అలాంటివాళ్ళకి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చినపుడు మాత్రమే చేయటం జరుగును గమనించగలరు.
ఆధార్ సీడింగ్ కరెక్షన్
తప్పుగా వున్నా ఆధార్ నీ అలా వదిలేసి కొత్త ఆధార్ తో ముందుగా ప్రజాసాధికార సర్వే లో యాడ్ అయిన తరువాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలము. గమనించగలరు
అడ్రస్ చేంజ్ :
ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా గా ఆ సచివాలయం అడ్రస్ ఉండవలెను మరియు కుటుంబ పెద్ద వేలి ముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము గమనించగలరు.
సరెండర్ రైస్ కార్డు :
బియ్యం కార్డు వద్దు అనుకున్న వారు వారి యొక్క బియ్యం కార్డు ని సరెండర్ చేసుకోవచ్చును.
Where to Apply For AP Ration Card Services
పైన తెలిపిన 7 రకముల AP Ration Card Services ను ఎవరికి వారు వారు ఏ సచివాలయ పరిధికి వస్తారో ఆ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతానికి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అవకాశంన్నది. ఏపీ ప్రభుత్వం మే రెండవ వారం నుండి Manamitra WhatsApp Governance ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ను కల్పించడం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ వారు తెలియజేశారు . Ration Card విభజన మినహా మిగిలిన సర్వీస్లన్నిటికీ Application Fee Rs.24/- మాత్రమే రేషన్ కార్డు విభజనకు మాత్రం 48 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
Documents Required For AP Ration Card Services
AP Ration Card Services దరఖాస్తు చేయాలి అంటే తప్పనిసరిగా కింద చూపించినటువంటి దరఖాస్తు ఫారాలతో పాటుగా మిగిలిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి అవేంటో ఒకసారి చూడండి..

Download AP Ration Card Application Forms
New Rice Card | Download |
Member Split | Download |
Member Adding | Download |
Member Deletion | Download |
Address Change | Download |
Wrong Aadhaar Correction | Download |
Surrender Card | Download |
AP Ration Card Services Work Flow
దరఖాస్తుదారుడు దరఖాస్తు ఫారంతో సరిపడా సపోర్టింగ్ డాక్యుమెంట్లతో గ్రామ / వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును పొందుతాడు. రసీదులో ఇచ్చినటువంటి దరఖాస్తు నెంబరు T Number తో మొదలైనటువంటి నెంబర్తో సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి లేదా వీఆర్వో లేదా డిజిటల్ అసిస్టెంట్ లేదా మహిళ పోలీస్ వారి GSWS Employees App లో Ration Card eKYC పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత సంబంధిత అప్లికేషన్ VRO వారి ePDS అనే Web Site కు ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ వారు అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధిత MRO వారి తుది ఆమోదం కొరకు వారి లాగిన్ కు వెళ్తుంది వారి లాగిన్ లో డిజిటల్ కి ద్వారా అప్లికేషన్ ఆమోదం తెలుపుతారు. గతంలో VRO వారి లాగిన్ లో కార్డు ప్రింటింగ్ ఆప్షన్ ఉండేది కానీ ప్రస్తుత గవర్నమెంటు ఏం చేస్తుందంటే ఏవైతే కార్డులన్ని ఈకేవైసి పూర్తయి ఎమ్మార్వో వారి లాగిన్ లో తుది ఆమోదం అవుతాయో వాటిని మరియు ఇప్పటివరకు ఉన్నటువంటి రైస్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ ఉండి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తుంది. పంపిణీ చేసే సమయంలో గతంలో లాగే కార్డును సంబంధిత లబ్ధిదారులకు లేదా రేషన్ కార్డుదారులకు అందించి వారి వద్ద మొబైల్ యాప్ లో ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది . తీసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉన్నా పరవాలేదు.
ఇక్కడ దరఖాస్తు చేసిన తర్వాత eKYC కొరకు ఎవరైతే Adding అవుతారో వారు తప్పనిసరిగా eKYC వేయాల్సి ఉంటుంది . eKYC అంటే బయోమెట్రిక్ అని అర్థము అదే కార్డును విభజన చేసినట్లయితే కార్డు విభజనలో ఎవరెవరైతే ఉంటారో వారు అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ వేసేటప్పుడు వయసు ఐదు సంవత్సరాలు కన్నా తక్కువ ఉన్నట్టయితే వారి స్థానంలో ఇంట్లో వారి తల్లి లేదా తండ్రి ఎవరైనా బయోమెట్రిక్ వేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు సరెండర్ కు ఎటువంటి బయోమెట్రిక్ అవసరం లేదు. రేషన్ కార్డులో చిరునామా మార్పుకు గాను మీరు ఎక్కడికైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ మండలం ఎమ్మార్వో వారి లాగిన్ లో తుది ఆమోదం చేసినట్లయితే నేరుగా కార్డు ప్రింట్ అయి వస్తుంది. కార్డులో సభ్యుల తొలగింపుకు సంబంధించి ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి మాత్రమే అవకాశం ఉంది. అటువంటివారిని తొలగించుటకు తప్పనిసరిగా వారి డెత్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.
How to Check Rice Card Services Application Status
గ్రామ/ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన రసీదులో

అప్లికేషన్ నెంబర్ T ట్ తో మొదలైన నెంబర్ తో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది ఎవరు ఏ రోజున ఆమోదం తెలిపారు అనే వివరాలు ఈ లింకు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ కొరకు కింద లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేయండి .
Know Ration Card Application Status

Leave a Reply