ఏపి లో కొత్త జిల్లాల పేరుతో అడ్రస్ సర్టిఫికేట్లు..ఆధార్ లో మార్చుకునేందుకు వీలుగా నిర్ణయం

,
ఏపి లో కొత్త జిల్లాల పేరుతో అడ్రస్ సర్టిఫికేట్లు..ఆధార్ లో మార్చుకునేందుకు వీలుగా నిర్ణయం

ఏపి లో కొత్త జిల్లాల పేరుతో అడ్రస్ ప్రూఫ్ పొందాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఏప్రిల్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త జిల్లాల పేరిట అడ్రస్ సర్టిఫికెట్ల జారీకి ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో 13 జిల్లాలకు 26 జిల్లాలకు పెంచిన తర్వాత ఎంతో మంది ఆధార్ కార్డ్ లో కొత్త జిల్లా అప్డేట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో సులభంగా అడ్రస్ మార్చుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ, సరైన అడ్రస్ ప్రూఫ్ లేని కారణంగా వారు అప్డేట్ చేసుకోలేక పోతున్నారు.

ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI సూచించిన ఫార్మాట్ లో అడ్రస్ సర్టిఫికేట్

ఆధార్ విశిష్ట ప్రాధికార సంస్థ యూఐడీఏఐ కొన్ని ప్రత్యేక సర్టిఫికెట్ల ఫార్మాట్ లను సూచించడం జరుగుతుంది. అటువంటి ఫార్మాట్ లోనే సోమవారం నుంచే అడ్రస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. అడ్రస్ ప్రూఫ్ జారీ బాధ్యతను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ అధికారు
లకు అప్పగించడం జరిగింది. ఇందుకోసం ఇప్పటికే
సచివాలయాల సేవలకు సంబంధించిన ఆన్లైన్ సేవా పోర్టల్లో కొత్తగా ఈ సేవను కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు త్రావు లేకుండా QR code తో కూడిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఈ మేరకు నిర్ణయించారు. ఈ అడ్రస్ ధృవీకరణ పత్రాల పై సంబంధిత వ్యక్తి ఫోటో.. దానిపై గ్రామ, వార్డు రెవెన్యూ
అధికారుల సంతకం, సచివాలయ స్టాంప్ ముద్ర వేసి అందజేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ  అధికారులు వెల్లడించారు.

ఒకసారి ప్రూఫ్ వచ్చిన తర్వాత సులభంగా మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ అడ్రస్ లో కొత్త జిల్లాలను మార్చుకోవచ్చు.

ఆన్లైన్ లో 5 నిమిషాల్లో అడ్రస్ లో కొత్త జిల్లా ఈ కింది విధంగా మార్చుకోవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page