ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు

ఏపీ రైతులకు గుడ్ న్యూస్…ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ.7 లక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతు కుటుంబాలకు అండగా నిలుస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2024 జూన్‌ నుంచి ఇప్పటివరకు 39 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు చొప్పున ఆర్థికసాయాన్ని అందజేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.

రాష్ట్రంలో 2024 జూన్‌కు ముందు 103 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2024-25లో 81 ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులకు రూ.5.67 కోట్లు. వీటిలో రూ.3.43 కోట్లు 49 మంది రైతుల కుటుంబాలకు విడుదల చేశాము. మిగిలిన 32 రైతుల ఆత్మహత్యల కేసులకు సంబంధించి రూ.2.24 కోట్లను త్వరలో విడుదల చేస్తాము’ అని అసెంబ్లీలో ప్రకటించారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.

Click here to Share

You cannot copy content of this page