MEE SEVA UPDATE : మీసేవ ఆపరేటర్ల కు గుడ్ న్యూస్..అన్ని అనుమతులు వెంటనే ఇవ్వండి : హై కోర్ట్

MEE SEVA UPDATE : మీసేవ ఆపరేటర్ల కు గుడ్ న్యూస్..అన్ని అనుమతులు వెంటనే ఇవ్వండి : హై కోర్ట్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ నిర్వాహకులకు గత ఏడాది పలు డిజిటల్ సర్వీసెస్ ను ఏపి ప్రభుత్వం నిలిపి వేసింది. సచివాలయాలకే ఈ సేవలను పరిమితం చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ మీ సేవ ఆపరేటర్లు గత ఏడాది హై కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ మేరకు హై కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది.

హై కోర్ట్ ఏమి తీర్పు ఇచ్చిందంటే

ప్రభుత్వ సిటిజన్ చార్టర్ ప్రకారం మీ సేవ కేంద్రాలకు అన్ని రకాల డిజిటల్ సర్వీసుల కు అను మతివ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల్లో కొన్నిరకాల డిజిటల్ సేవలను ప్రభుత్వం నిలిపి
వేసింది. దీన్ని సవాల్ చేస్తూ మీ సేవా ఆపరేటర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గతంలో మాదిరిగా అన్నిరకాల సేవలు అందించేందుకు మీ సేవా కేంద్రాలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆదేశాలు అమలు కాకపోవటంతో అసోసియేషన్ కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేసింది.
దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు బుధవారం విచారణ జరిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలన్నారు. తదుపరి విచారణ ఈనెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Click here to Share

One response to “MEE SEVA UPDATE : మీసేవ ఆపరేటర్ల కు గుడ్ న్యూస్..అన్ని అనుమతులు వెంటనే ఇవ్వండి : హై కోర్ట్”

  1. Namana Sivaramakrishna Avatar
    Namana Sivaramakrishna

    please send court order copy sir

You cannot copy content of this page