ప్రతి ఏటా సముద్రంలో మత్స్యకారుల వేట నిషేధాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగాంగా ఈ ఏడాది కూడా చేపల వేట నిషేధ తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 14 నుంచే సముద్రంలో వేటకు విరామం
2023 ఏడాది కి సంబందించి ఈ నెల అనగా ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు వేట విరామాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమాచారాన్ని తీర ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులకు మత్స్య శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.
సముద్రంలో మత్స్య సంపద కి సంబంధించి ఏప్రిల్ నుంచి జూన్ వరకు పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మత్స్య సంపద ను పెంచుకునే విధంగా ప్రభుత్వం ప్రతి ఏటా ఈ వేట కేంద్రం దేశ వ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమలు చేస్తుంది. అయితే ఈ నిషేధ సమయం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.
మే లో వైఎస్సార్ మత్స్యకార భరోసా
వేట నిషేధ సమయాలలో మత్స్య కార కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గాను ప్రతి ఏటా ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది.
ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలను ఆర్థిక సహాయం కింద అందిస్తున్నారు.
YSR Matsyakara Bharosa Release Date : May 2023
ఏపి లో ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిగోదావరి, కృష్ణ గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లా ల్లో వేట సాగించే మత్స్య కార కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.09 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ పథకం తో లబ్ది పొందుతున్నారు.
గత ప్రభుత్వ హయాం లో 4 వేలు ఇస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం 10 వేలకు పెంచిన విషయం తెలిసిందే.
Leave a Reply