ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు… సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డ్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు సంచల నిర్ణయం తీసుకుంది ఇకపై ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉండవని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలని ఎలక్షన్స్ తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఈ సిలబస్ పై దృష్టి పెట్టిందని NCERT సిలబస్ వల్ల మాథ్స్, కెమిస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుంది. ఇంటర్లో ప్రతి సబ్జెక్టుకు ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుని అందుకు తగ్గట్టుగా మార్పులు చేయనున్నట్టు బోర్డు తెలిపింది. ఇందుకు గాను జనవరి 26 వరకు అవకాశం కలదని వెబ్సైట్లో తమ అభిప్రాయాలను చెప్పొచ్చని బోర్డు తెలిపింది

Click here to Share

You cannot copy content of this page