2025 – 26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రైవేటు ఇంటర్ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇంటర్ బోర్డు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 9వ తేదీ సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని 37 మండలాలలో 47 కళాశాలలు, మున్సిపల్ పరిధిలో 6కళాశాలలు గుర్తింపు పొంది ఉన్నట్లు తెలిపారు. కొత్త కళాశాలల వారు బీఐఈజియో ట్యాగింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
అలాగే కళాశాల బిల్డింగ్, తరగతి గదులు, ల్యాబులు, లైబ్రరీ, క్రీడా మైదానం తదితర ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ జియో ట్యాగింగ్ ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు దరఖాస్తులను, కళాశాలను పరిశీలిస్తారని తెలిపారు. జనవరి 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
దరఖాస్తులను అసంపూర్తిగా నింపిన యెడల, కళాశాలకు సంబంధించిన ఫొటోలుఅప్లోడ్ చేయకుండా నేరుగా హెడ్ ఆఫీస్కు పంపిన దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపారు.
మార్చి 15 నుంచి టెన్త్ పరీక్షలు
ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పాఠశాల విద్య అధికారులు ఈ నెల ప్రారంభంలో పదవతరగతి పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేశారు. ఈ నెల 1నుంచి మార్చి 10 వరకు ఈ యాక్షన్ ప్లాను రూపొందించారు. మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబస్లో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్సైట్లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి అప్లోడ్ చేశారు.
పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదోతరగతి చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు.
ఆ మూడు సంవత్సరాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫెయిల్అయిన విద్యార్థులు, ఈ ఏడాది ఫెయిల్ అయిన సబ్జెట్లు రాయాలనుకుంటే వారుపాత సిలబస్ ప్రకారమే రాయడానికి అవకాశం ఉంది. ప్రైవేట్, రీ ఎన్రోల్చేసుకున్న విద్యార్థులు, ఆయా సంవత్సరాల్లో ఏ సిలబస్ ప్రకారం అయితే పరీక్షలు రాశారో, ఈ ఏడాది పబ్లిక్ పరీక్షల్లో కూడా వారికి పాత సిలబస్ వర్తిస్తుంది.
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచిప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే.. మార్చి 1 నుంచి 20 వరకూ నిర్వహించనున్నారు. పర్యావరణం,మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉండనున్నాయి. అయితే పరీక్షల షెడ్యూల్ పై ప్రభుత్వం ఆమోదం లభించిన తరువాత అధికారులు అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. నవంబర్ 21వ తేదీతో ఫీజుల చెల్లింపు గడువుముగిసింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ విద్యార్థులతో పాటు సప్లమెంటరీ విద్యార్థులు ఫీజులు చెల్లింపు తేదీలను విడుదలచేశారు. హాజరు మినహాయింపు పొందిన అభ్యర్థులు కూడా వార్షిక పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 5వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించడానికి అనుమతించారు.
Leave a Reply