ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైనటువంటి సిఆర్డిఏ పరిధిలో పేదల కు ఇళ్లపట్టాల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఉత్తర్వులపై పలువురు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు వాటిని మరియు వీటికి సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టి వేసింది.
రాజధానిని అభివృద్ధి చేయాలన్న హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు మేరకే ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించడం జరిగింది. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ మేరకు జీవో నెంబర్ 45 స్థలాల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని, ప్రస్తుతం ఉన్నటువంటి పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది.
ఇప్పటికే ఆర్-5 జోన్ లో వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 1,134,58 ఎకరాల్లో 21 లేఔట్ లు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఇక CRDA పరిధిలో 48,218 మంది పేదలకు ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.ఈ స్థలాలకు సంబంధించి ఈనెల 15న తొలి దశలో భాగంగా పట్టాల పంపిణీ కి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
ఏపి లో పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి మరిన్ని లింక్స్ , ఫార్మ్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి
Leave a Reply