ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డుల్లో వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వాలంటీర్స్ కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ముఖ్యమంత్రి జగన్ జన్మదిన కానుకగా జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్స్ జీతం అదనంగా రూ.750 రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు.
వాలంటీర్ల జీతం 5000 నుంచి 5750 పెంపు?
గ్రామాల్లో, పట్టణాల్లో వాలంటీర్లకే కేటాయించిన 50 ఇళ్ల పరిధిలో రేషన్‌ను పకడ్బందీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నెలకు రూ.5వేలు కాకుండా అదనంగా నెలకు రూ.750 పెంచుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వాలంటీర్లకు ఇంకా మంచి చేస్తామన్నారు.
2.30 లక్షల మంది వాలంటీర్లకు పెరగనున్న జీతం
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.30 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. 2019 అక్టోబర్ 2 న ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా దాదాపు నాలుగేళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు.
వృద్ధాప్య పెన్షన్ పై కూడా కీలక అప్‌డేట్
డిసెంబర్ 21న ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాప్య పెన్షన్ ను కూడా పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే జనవరి నుంచి 3000 రూపాయల కు చేరనున్న పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
అన్నీ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించిన యాప్ మరియు లింక్స్ కోసం కింది పేజ్ చెక్ చేయండి
ఈ ఆర్టికల్ పై మీ ఒపీనియన్ కింది కామెంట్ రూపంలో తెలియజేయండి
Leave a Reply